నడ్డా సభ సక్సెస్‌… బీజేపీలోకి భారీగా చేరికలు!

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన నడ్డా సభ సక్సెస్‌ అయింది. బీజేపీ బహిరంగ సభకు విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఆయనకు ప్రధాన ద్వారం నుంచి వేదిక వరకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీజేపీలో చేరడానికి భారీ ఎత్తున పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో సభ కిక్కరిసిపోయింది. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరికలు భారీగా జరిగాయి. టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు బీజేపీలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:46 am, Mon, 19 August 19
నడ్డా సభ సక్సెస్‌... బీజేపీలోకి భారీగా చేరికలు!

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన నడ్డా సభ సక్సెస్‌ అయింది. బీజేపీ బహిరంగ సభకు విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఆయనకు ప్రధాన ద్వారం నుంచి వేదిక వరకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీజేపీలో చేరడానికి భారీ ఎత్తున పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో సభ కిక్కరిసిపోయింది. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరికలు భారీగా జరిగాయి. టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరడంతో ఆయన అభిమానులు, దేశం నాయకులు కూడా ఆయన బాట పట్టారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తరలి వచ్చారు. (రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాల నుంచి భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. సభలో తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరుతున్న నాయకులు, నాయకురాళ్ల హడావిడే ఎక్కువగా కనిపించింది.

హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలపై దృష్టి సారించిన బీజేపీ నాయకులు టీడీపీ నుంచి భారీ చేరికలు ఉండేటట్లు చేయడంలో సక్సెస్‌ అయ్యారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి గ్రేటర్‌లో కాషాయ జెండా ఎగుర వేయాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ నాయకులను చేర్చుకోవడంలో ఓ అడుగు ముందుకు పడింది.