డ్రంకెన్ డ్రైవ్: ఒక్క నెలలో 2536మందిపై కేసు

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ చేస్తోన్న వారిపై కేసులను నమోదు చేయడంతో పాటు వారికి శిక్షలను వేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2536 మంది వాహనదారులపై కేసులను నమోదు చేశారు. వీరిపై అభియోగాలు మోపి చార్జీషీటు దాఖలు చేయడంతో 3,4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 340 మంది వాహనదారులకు ఒక రోజు నుంచి 30 రోజుల […]

డ్రంకెన్ డ్రైవ్: ఒక్క నెలలో 2536మందిపై కేసు
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 9:02 AM

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ చేస్తోన్న వారిపై కేసులను నమోదు చేయడంతో పాటు వారికి శిక్షలను వేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2536 మంది వాహనదారులపై కేసులను నమోదు చేశారు. వీరిపై అభియోగాలు మోపి చార్జీషీటు దాఖలు చేయడంతో 3,4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 340 మంది వాహనదారులకు ఒక రోజు నుంచి 30 రోజుల వరకు జైలు శిక్షను విధించింది. ఇందులో 121 మంది లైసెన్స్‌లను శాశ్వతంగా, తాత్కాలికంగా రద్దుచేయాలని ట్రాఫిక్ పోలీసులు ఆర్‌టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. అలాగే డ్రంకెన్ డ్రైవింగ్‌కు పాల్పడ్డ వాహనదారుల నుంచి 54.94 లక్షలను జరిమానా కింద వసూలు చేశారు. కాగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులలో పట్టుబడి శిక్ష ఖరారైన వాహనదారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, వీసాలు, పాసుపోర్టు అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ స్పష్టం చేశారు.