Ambedkar Statue: ప్రతిష్ఠాత్మక అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

| Edited By: Ravi Kiran

Apr 14, 2023 | 3:15 PM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ అంబేడ్కర్‌

Ambedkar Statue: ప్రతిష్ఠాత్మక అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
Ambedkar Statue
Follow us on

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ భారీ విగ్రహాన్ని శుక్రవారం (ఏప్రిల్ 14) మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ హాజరుకానున్నారు. 50 అడుగుల పీఠంపై ఏర్పాటు చేసిన 125 అడుగుల లోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి  కేసీఆర్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది ప్రజలు తరలివచ్చేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేసింది. వారంతా కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించింది. పీఠం లోపల అంబేడ్కర్‌ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆడియో, విజువల్‌ ఏర్పాట్లు, ఇంటీరియర్‌ డిజైన్లు పూర్తయ్యాయి.

షెడ్యూల్‌ ఎలా ఉందంటే?

పార్లమెంట్‌ ఆకారంలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కోసం సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 3 గంటలకు ప్రాంగణానికి చేరుకుంటారు. ముందుగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత ఆడిటోరియం భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అంబేడ్కర్‌ పాదాల వద్దకు చేరుకుని బౌద్ధ గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆపై విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 

ఇవి కూడా చదవండి

అంబేడ్కర్ స్మృతి వనం ల్యాండ్ ఎస్కేప్ ఏరియా నైట్ విజువల్స్ :

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..