శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 11 కేజీల బంగారం..

గోల్డ్ అక్రమ రవాణాకు.. సౌతిండియా కేరాఫ్‌గా మారింది. గల్ఫ్ దేశాల నుంచి భారీగా దక్షిణాది రాష్ట్రాలకు బంగారం దిగుమతి కావడంతో.. ఎయిర్‌పోర్టుల్లో భారీగా తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. తాజాగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న మహిళ నుంచి పదకొండున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. భారీ ఎత్తున గోల్డ్ తరలిస్తున్నారని అధికారులు సమాచారం వచ్చింది. దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికులను […]

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 11 కేజీల బంగారం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 28, 2019 | 12:25 PM

గోల్డ్ అక్రమ రవాణాకు.. సౌతిండియా కేరాఫ్‌గా మారింది. గల్ఫ్ దేశాల నుంచి భారీగా దక్షిణాది రాష్ట్రాలకు బంగారం దిగుమతి కావడంతో.. ఎయిర్‌పోర్టుల్లో భారీగా తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. తాజాగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న మహిళ నుంచి పదకొండున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు.

భారీ ఎత్తున గోల్డ్ తరలిస్తున్నారని అధికారులు సమాచారం వచ్చింది. దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓ మహిళ నుంచి 11 కిలోల పైన బంగారం లభించింది. మహిళను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. గోల్డ్ అక్రమ రవాణా వెనుక ఎవరు ఉన్నారు..? అనే దానిపై ఆరా తీస్తున్నారు. కొన్నాళ్లుగా చెన్నై, కోచ్చి, శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో భారీగా తనిఖీలు చేపడుతున్నారు అధికారులు.