Hyderabad: ఓ లేడీ, ఏడుగురు వ్యక్తులు.. ORRపై దూసుకెళ్తున్న కారు.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఓ లేడి, ఏడుగురు వ్యక్తులు.. ఓఆర్ఆర్‌పై దూసుకెళ్తున్న రెండు కారులు.. అనుమానమొచ్చి పోలీసులు ఆపి చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. హైదరాబాద్ రూట్‌లో పూణే వైపు వెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. నిత్యం తనిఖీలతో స్మగ్లర్లు, పెడ్లర్స్‌కు కళ్లెం వేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 108 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసినవారిలో ఒక మహిళతో పాటు మహారాష్ట్రకు చెందిన ఏడు మంది ఉన్నారు. వారిని ప్రశాంత్ గణేష్, లతా గణేష్ జాధవ్, సచిన్ దిలీప్, రోహన్ పండురంగ్, రాహుల్ బాబురావ్, గౌరవ్ నాటేకర్, పవన్ దీప్‌గా గుర్తించారు.
పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ ముఠా గత నాలుగు సంవత్సరాలుగా మాదక ద్రవ్యాల రవాణాలో కొనసాగుతూ వస్తోంది. వీరిపై మహారాష్ట్రలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. గంజాయిని ఒడిశాలోని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి.. విశాఖపట్నం – హైదరాబాద్ రూట్‌లో పూణేకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్‌పై పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనలో రెండు కార్లు, 108 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని.. నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. మత్తు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
