AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Bus Accident: హైదరాబాద్‌ శివారులో స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్ శివారు మొయినాబాద్‌ మృగవాణి పార్క్‌ సమీపంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్‌ బస్సు ప్రమాదావశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు.. గాయపడిన విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

School Bus Accident: హైదరాబాద్‌ శివారులో స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు
Hyderabad News
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jan 28, 2026 | 6:55 PM

Share

మొయినాబాద్‌ మృగవాణి పార్క్‌ సమీపంలో స్కూల్‌ బస్సు బోల్తా పడిన ఘటన బుధవారం తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ వైపు వస్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో ఉన్న విద్యార్థుల సంఖ్య, గాయాల తీవ్రతపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా ఉన్నదా, డ్రైవర్ నిర్లక్ష్యం వహించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే బస్సు బ్రేకులు, సాంకేతిక లోపాలపై కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌ యాజమాన్యం కూడా ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం