Hyderabad: హైదరాబాద్‌లో రూ.6.5 కోట్ల నగదు పట్టివేత.. పొంగులేటి డబ్బేనా..?
తాజాగా హైదరాబాద్‌లో 6.5 కోట్ల నగదు తనిఖీల్లో పట్టుబడింది. అప్పా జంక్షన్ నుంచి దూసుకెళ్తోన్న కార్లను చెక్ చేశారు పోలీసులు. . 6 కార్లలో ఆరున్నర కోట్ల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. ఇంత డబ్బు ఎవరిది? ఎక్కడికి? ఎందుకు ? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది.
ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతున్నాయి. ఈనెల 30న జరుగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటికే రూ.570 కోట్లకు పైగా విలువైన డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలిస్తుండగా.. అప్పా జంక్షన్ దగ్గర రూ.6.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన డబ్బుగా సమాచారం అందుతుంది. ఆరు కార్లలో డబ్బు తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే తరలిస్తున్నారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి కార్లను సీజ్ చేశారు.
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం నివాసంలో ఐటీ సోదాలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోదాలు పూర్తయ్యాక విచారణ కోసం హైదరాబాద్ రావాలన్న ఐటీ అధికారుల సూచనతో పొంగులేటి సతీమణి, కుమారుడు, సోదరుడు హైదరాబాద్ వెళ్లివచ్చారు. ఆ సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు పొంగులేటి. తన బంధువులు, 30 మంది సన్నిహితుల ఇళ్లపై 400మంది అధికారులు దాడులు చేశారని, నారాయణపురంలోని తన తల్లి ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారని పొంగులేటి తెలిపారు. కనీసం లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారని, తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, బంధువులపై మాన్ హ్యండలింగ్ చేశారని ఆరోపించారు పొంగులేటి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…