AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: హైద్రాబాద్‌లో రిగ్గింగ్‌కు ఛాన్స్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైద్రాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గట్టి నిఘా పెట్టింది. పోలింగ్ కేంద్రాలలో సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించిన ఎలక్షణ్ కమిషన్ ప్రత్యేక అధికారులను నియమించింది. పోలింగ్ స్టేషన్ పరిధిలో అనుబణువు మానిటరింగ్ చేస్తుంది. క్రిటికల్‌గా ఉండే ప్రాంతాల్లో రిగ్గింగ్‌కు ఛాన్స్ ఉందన్న అనుమానాలతో ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక దృష్టి పెట్టింది ఎలక్షన్ కమిషన్.

Telangana Election: హైద్రాబాద్‌లో రిగ్గింగ్‌కు ఛాన్స్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్
Ec On Polling
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Nov 18, 2023 | 4:34 PM

Share

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైద్రాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గట్టి నిఘా పెట్టింది. పోలింగ్ కేంద్రాలలో సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించిన ఎలక్షణ్ కమిషన్ ప్రత్యేక అధికారులను నియమించింది. పోలింగ్ స్టేషన్ పరిధిలో అనుబణువు మానిటరింగ్ చేస్తుంది. క్రిటికల్‌గా ఉండే ప్రాంతాల్లో రిగ్గింగ్‌కు ఛాన్స్ ఉందన్న అనుమానాలతో ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక దృష్టి పెట్టింది ఎలక్షన్ కమిషన్.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 సెగ్మెంట్లలో ఉన్న 4,119 పోలింగ్ కేంద్రాలపై కన్నేసింది ఎన్నికల సంఘం. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1,800 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక పరిస్థితులు ఉన్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టింది ఈసీ. పోలింగ్ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు హైదరబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్‌కు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.

జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లోని 15 నియోజక వర్గాల లో గోషామహల్, నాంపల్లితో పాటు ఓల్డ్ సిటీలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఈసీకి కొన్ని వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తం అయింది ఎన్నికల కమిషన్. ఈ అంశంపై ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఫిరోజ్ ఖాన్ లాంటి నేతలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. పోలింగ్ సమయంలో రిగ్గింగ్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. దీంతో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలతో పాటు సెంట్రల్ బలగాలను నియమించి నిఘా పెట్టింది ఎన్నికల కమిషన్.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా బోగస్ ఓట్ల విషయంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టిన ఈసీ. ఈ అంశంపై రాజకీయ పార్టీల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంది. దీంతో డెత్ అండ్ అడ్రస్ లేని ఓటర్లను దాదాపు 4లక్షల వరకు ఉన్నట్లు గుర్తించిన ఈసీ. ఆ ఓట్లను తొలగించింది ఎన్నికల కమిషన్. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ స్థానాలలో 45లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు స్పెషల్ గా మానిటరింగ్ చేస్తుంది ఎన్నికల కమిషన్. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.