Telangana Election: బీఆర్ఎస్ కారును ప్రధాని మోదీ సంక్షేమ పథకాల గ్యారేజీకి పంపించాలిః అమిత్ షా

తెలంగాణలో రాబోయే ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. అవినీతిమయమైన కేసీఆర్ సర్కారును గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు.

Telangana Election: బీఆర్ఎస్ కారును ప్రధాని మోదీ సంక్షేమ పథకాల గ్యారేజీకి పంపించాలిః అమిత్ షా
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 18, 2023 | 5:00 PM

తన సుడిగాలి పర్యటనతో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు బీజేపీ అగ్ర నేత అమిత్‌ షా. శనివారం మూడు సభలు టార్గెట్‌గా ఆయన దూసుకెళ్లారు. అమిత్‌ షా పర్యటనలతో బీజేపీ కేడర్‌లో జోష్‌ పెరిగింది. గద్వాల, నల్లగొండ సభల్లో అధికార బీఆర్ఎస్‌పై ఆయన వాగ్బాణాలు సంధించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విమర్శల దాడి చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేయడంతో పాటు మతపరమైన నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని మరోసారి అమిత్ షా పునరుద్ఘాటించారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. అవినీతిమయమైన కేసీఆర్ సర్కారును గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ కారును ప్రధాని మోదీ సంక్షేమ పథకాల గ్యారేజీకి పంపించాలని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలన్న అమిత్ షా.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి సోనియా గాంధీ, కేటీ రామారావును సీఎం చేయడానికి కేసీఆర్ తెగ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీలకు అన్యాయం చేశాయని, ప్రధాని మోదీ పాలనలో ఓబీసీలకు సముచిత స్థానం కల్పించిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే, తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎంఐఎం మెప్పు కోసం కేసీఆర్ ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు ,చేసి బీసీలకు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రజా ప్రతినిధులు అవినీతి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో 22 వేల కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు అమిత్ షా. అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని అమిత్ స్పష్టం చేశారు.

తెలంగాణలో రాబోయే ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…