Telangana Election: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వేటు తప్పదు.. ఎవరైతే నాకేంటి అంటున్న ఎలక్షన్ కమిషన్

ఎలక్షన్ కోడ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా అమలు పరుస్తోంది. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వరుసగా అధికారులపై వేటు వేస్తోంది. 20మంది అధికారులతో మొదలైన సస్పెన్షన్ చర్యలు.. నిన్నటి టూరిజం శాఖ ఎండి మనోహర్ రావు వరకు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే అది మంత్రి అయినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఈసీ.

Telangana Election: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వేటు తప్పదు.. ఎవరైతే నాకేంటి అంటున్న ఎలక్షన్ కమిషన్
Election Commission
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 18, 2023 | 5:45 PM

ఎలక్షన్ కోడ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా అమలు పరుస్తోంది. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వరుసగా అధికారులపై వేటు వేస్తోంది. 20మంది అధికారులతో మొదలైన సస్పెన్షన్ చర్యలు.. నిన్నటి టూరిజం శాఖ ఎండి మనోహర్ రావు వరకు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే అది మంత్రి అయినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఈసీ.

తెలంగాణ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సెంట్రల్ ఎలక్షన్ కమీషన్. ఎన్నికలు జరుగుతున్న మిగతా 4 రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పై మరింత నిఘా పెట్టింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వకముందు నుండే, ఇక్కడి పరిస్థితులను గమనిస్తున్న సెంట్రల్ ఈసీ.. ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గ చర్యలను చేపట్టింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ముందు నుండి రాష్ట్రంపై ప్రత్యేక నిఘా పెట్టిన సెంట్రల్ ఈసీ. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వారంలోపే 20 మంది అధికారుల పై వేటు వేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ కి అంతర్గత సమాచారం ఆధారంగా అధికారులపై చర్యలు తీసుకుంది.

అధికారులపైనే కాదు ఓటరు సమస్యలపైన కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దాని కోసం జిల్లాల వారీగా కాల్ సెంటర్ నీ ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కాల్ సెంటర్‌కు 5వేల కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,042, రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 823, 790 ఫిర్యాదులతో హైదరాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. అయితే వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఫిర్యాదుదారునికి వివరణ ఇస్తోంది ఎన్నికల సంఘం.

అభ్యర్థులు, అధికారుల పనితీరుపై కూడా ప్రత్యేక నిఘా పెట్టింది ఎలక్షన్ కమిషన్. పలువురు అభ్యర్థులపైన వచ్చే ఫిర్యాదులపై సెంట్రల్ నుంచి వచ్చిన అధికారులను వివరాలు సేకరిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఇప్పటి వరకు దాదాపుగా అభ్యర్థులు వారి పనితీరు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై దాదాపు 20వేలకు పైగా ఫిర్యాదులు ఈసీకి అందాయి. కోడ్ ఉల్లంఘిస్తే కరినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు ఇస్తో్ంది. కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు చేసింది ఈసీ. ఇటీవలే అధికారిక భవనం లో పార్టీ కార్యక్రమలు చేస్తున్నారని ప్రగతి భవన్‌కు సైతం నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంది ఈసీ. ఇక అధికారిక భవన్ లో కోడ్ ఉండగా హామీలు ఇవ్వడంపై కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది ఈసీ.

ఇక, తాజాగా కోడ్ వాయిలేషన్ కు పాల్పడిన టూరిజం ఎండీ మనోహర్ రావుపై సస్పెన్షన్ వేటు, OSD సత్యనారాయణ విధుల నుంచి తప్పించింది. ఇలా ఎప్పటికప్పుడు అధికారులు, నాయకులపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటున్న ఎన్నికల సంఘం, వెంటనే చర్యలు తీసుకుంటూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నం అని మెసేజ్ ఇస్తోంది.

అయితే ఎన్నికల విధుల్లో ఉన్న రిటర్నింగ్ అధికారుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ల కు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు రిటర్నింగ్ అధికారులపై ఫిర్యాదులు చేశాయి. నామినేషన్ల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు, ఫిర్యాదులు ఈసీకి అందాయి. ఇక నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ సమయంలో రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీకి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ వరుస ఫిర్యాదులు సీఈఓ వికాస్ రాజ్ కు అందాయి. అయితే రిటర్నింగ్ అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో పాటు, సెంట్రల్ ఎలక్షన్ కమీ‌షన్‌కు సైతం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎన్నికల నిర్వహణ లో నిబంధనలు పాటించనీ అధికారులు, నాయకులపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కోడ్ ఉల్లంఘిస్తే అది ఎవ్వరైనా ఉపేక్షించేది లేదని అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తప్పు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆయా రాజకీయ పార్టీల నాయకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…