AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆటో దిగి పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన యువతి.. అసలు మ్యాటర్ తెలిసి షాక్!

బంగ్లాదేశ్‌కి చెందిన ఓ యువతి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మానవ అక్రమ రవాణా ముఠా చెర నుంచి ఓ యువతి తప్పించుకుంది. చదువుకునే వయసు ఉన్న ఆమెను ఓ స్నేహితురాలు భారతదేశం చూపిస్తానని మాయమాటలు చెప్పి ఆకర్షించింది. ఈ తప్పుడు హామీలకు మోసపోయిన యువతిని రాత్రి వేళల్లో బోటులో నది దాటి, అక్రమ మార్గంలో కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు వచ్చింది.

Hyderabad: ఆటో దిగి పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన యువతి.. అసలు మ్యాటర్ తెలిసి షాక్!
Hyderabad Auto
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 09, 2025 | 3:12 PM

Share

బంగ్లాదేశ్‌కి చెందిన ఓ యువతి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మానవ అక్రమ రవాణా ముఠా చెర నుంచి ఓ యువతి తప్పించుకుంది. చదువుకునే వయసు ఉన్న ఆమెను ఓ స్నేహితురాలు భారతదేశం చూపిస్తానని మాయమాటలు చెప్పి ఆకర్షించింది. ఈ తప్పుడు హామీలకు మోసపోయిన యువతిని రాత్రి వేళల్లో బోటులో నది దాటి, అక్రమ మార్గంలో కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు వచ్చింది.

భారతదేశంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆమెను స్వేచ్ఛగా తిరగనివ్వకుండా పట్టు బిగించారు దుర్మార్గులు. మెహదీపట్నంలో షహనాజ్ అనే మహిళ ఇంటికి తీసుకెళ్లగా.. అక్కడ చుట్కీ అనే మరో యువతి కూడా ఇదే తరహా మోసానికి గురైనదని తెలిసింది. తర్వాత సమీర్ అనే ఆటో డ్రైవర్, యువతిని హజీరా అనే మహిళ ఇంటికి తీసుకెళ్లి, అక్కడినుంచి వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టేశాడు. మొదట్లో నిరాకరించిన ఆమెను సహకరించకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారు. తనపై పోలీసులు కేసు వేస్తారనే భయంతో, బలవంతంగా వారి ఆదేశాలను పాటించక తప్పలేదు. ఆరు నెలల పాటు ఆమెను వివిధ హోటళ్లకు, లాడ్జ్‌లకు తీసుకెళ్లి వ్యభిచారానికి గురి చేశారు. ఈ సమయంలో ఆమెకు మానసిక, శారీరక ఇబ్బందులు పెంచి, తప్పించుకునే అవకాశం లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఉంచారు.

ఒకసారి సమీర్ ఆటోలో వెళ్తుండగా బండ్లగూడా పోలీస్ స్టేషన్ బోర్డు ఆమె కంటపడింది. ఆ క్షణం ఆమె మనసులో ధైర్యం కలిగింది. సమీర్ ఆటో పార్క్ చేయబోతున్న వేళను ఆసరాగా తీసుకుని వెంటనే పారిపోయి పోలీసుల వద్దకు చేరింది. అక్కడ తన పరిస్థితిని, ఇప్పటివరకు ఎదుర్కొన్న ఇబ్బందులను, తనపై జరిగిన మోసాన్ని కంటతడి పెట్టి వివరించింది. బాధితురాలి వాంగ్మూలం విన్న వెంటనే బండ్లగూడా ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, వారి బృందం రంగంలోకి దిగింది. అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో సమీర్, షహనాజ్, సర్వర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతిని అక్రమంగా దేశంలోకి చేర్చిన రూప ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆమెను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఈ కేసుతో పాటు పాతబస్తీ ప్రాంతంలో జరుగుతున్న వ్యభిచారం, హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌పై కూడా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ సంఘటన ద్వారా మానవ అక్రమ రవాణా కేవలం చట్ట విరుద్ధమే కాకుండా, అమాయకుల జీవితాలను నాశనం చేసే మానవత్వరహిత నేరమని స్పష్టమవుతోంది. దేశాల మధ్య సరిహద్దులను దాటి జరిగే ఈ నేరాలను అరికట్టడానికి కఠినమైన సరిహద్దు భద్రత, పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలు తప్పనిసరి. అంతేకాదు, సమాజంలో అవగాహన పెంచడం, పేదరికం, నిరుద్యోగం వంటి మూల కారణాలను తగ్గించడం కూడా అత్యవసరం. ఈ కేసు భవిష్యత్తులో ఇలాంటి ముఠాలను ఛేదించడానికి, మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించడానికి పోలీసులు తీసుకోవలసిన చర్యలకు ఒక హెచ్చరికలా నిలుస్తుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..