వాట్సప్ లో చిన్నారుల అశ్లీల వీడియోస్ ఫార్వర్డ్.. ఎంసీఏ విద్యార్థినీ కనిపెట్టిన అమెరికా
హైదరాబాద్‌లో ఎంసీఏ చదువుతున్న యువకుడు వాట్సాప్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు షేర్ చేసినందుకు తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఓ యువకుడు ఎంసీఏ చదవడం కోసం హైదరాబాద్ కి వచ్చాడు. స్థానికంగా ఉన్న అంబర్పేట్ లో నివాసం ఉంటున్నాడు.

హైదరాబాద్‌లో ఎంసీఏ చదువుతున్న యువకుడు వాట్సాప్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు షేర్ చేసినందుకు తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఓ యువకుడు ఎంసీఏ చదవడం కోసం హైదరాబాద్ కి వచ్చాడు. స్థానికంగా ఉన్న అంబర్పేట్ లో నివాసం ఉంటున్నాడు. గత రెండు సంవత్సరాల నుండి చైల్డ్ పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డాడు. ఇతర వెబ్‌సైట్స్ నుంచి చిన్నారుల అశ్లీల వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే కాక ఆ వీడియోస్ ను ఇతర మిత్రులతో షేర్ చేశాడు. అలాగే వాట్సప్ ద్వారా వీడియోస్ ఫార్వర్డ్ చేస్తునే ఉన్నాడు..
అయితే అమెరికాకు చెందిన హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ యువకుడి నెంబర్ను కనిపెట్టింది. పదే పదే చిన్నారుల పోర్న్ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తుండటంతో ఆ నెంబర్ ను ఇండియన్ రాయబార కార్యాలయానికి ఇచ్చింది. అక్కడి నుంచి నుంచి తెలంగాణ పోలీసులకు సమాచారం రావడంతో సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. సెల్ నెంబర్ టవర్ లొకేషన్ ఆధారంగా అంబర్పేట్ లో ఉంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా లోతైన దర్యాప్తు జరుగుతుంది. వీటిపై ఎప్పటికప్పుడు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల నిఘా నిరంతరం ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు క్రీయెట్ చేసినా ఫార్వర్డ్ చేసినా ఇట్టే పసిగెట్టేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. అలాగే ఫార్వర్డ్ చేస్తున్న నెంబర్లను కూడా ఎప్పటికపుడు ట్రేసింగ్ లో పెడతాయి.




