Hyderabad: చెప్పులు లేని నడకపై దృష్టి.. ఆధునిక యుగంలో ఆనాటి ట్రెండ్.. ప్రయోజనాలివే..

ఓల్డ్ ఇజ్ గోల్డ్ అంటారు.. కానీ ఇది నిజం. ఎందుకు అంటారా? పూర్వం మన భారత దేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళలనుకున్నా కాలి నడకన వెళ్లేవారు. ఇలా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ రాను రాను నడక తగ్గిపోయింది. ఎన్నోరకాల చెప్పులు, షూస్ అందుబాటులోకి వచ్చాక.. వాకింగ్, జాగింగ్, ట్రెక్కింగ్ క్యాజువల్ ఇలా అవసరానికి అనుగుణంగా చెప్పులు, షూస్ ఉపయోగిస్తున్నారు.

Hyderabad: చెప్పులు లేని నడకపై దృష్టి.. ఆధునిక యుగంలో ఆనాటి ట్రెండ్.. ప్రయోజనాలివే..
Hyderabad

Edited By:

Updated on: May 23, 2024 | 3:27 PM

ఓల్డ్ ఇజ్ గోల్డ్ అంటారు.. కానీ ఇది నిజం. ఎందుకు అంటారా? పూర్వం మన భారత దేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళలనుకున్నా కాలి నడకన వెళ్లేవారు. ఇలా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ రాను రాను నడక తగ్గిపోయింది. ఎన్నోరకాల చెప్పులు, షూస్ అందుబాటులోకి వచ్చాక.. వాకింగ్, జాగింగ్, ట్రెక్కింగ్ క్యాజువల్ ఇలా అవసరానికి అనుగుణంగా చెప్పులు, షూస్ ఉపయోగిస్తున్నారు. కానీ కాలి నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

కాలి నడక ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ట్రెండ్. ఒక వ్రతం లాగా పాటిస్తున్నారు. కొందరు మార్నింగ్ వాక్ కోసం కాలి నడకని ఎంచుకుంటే.. మరికొందరు రోజు మొత్తం చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడు అలవాటు పడుతున్నప్పటికీ మనదేశంలో మాత్రం చెప్పులు లేని నడక చాలామందికి తెలుసు. ఆరోగ్య విషయంలో భాగంగా చెప్పులు లేకుండా భూమి స్పర్శను పొందడం అనేది మెల్లిమెల్లిగా మన దేశంలో మళ్ళీ కనిపిస్తోంది. చాలామంది ప్రముఖులు కూడా మన దేశంలో చెప్పులు లేకుండా నడిచిన సందర్భాలు మనం చూశాం. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు పాదాలతో నడవడం చూస్తున్నాం. ఇలా ఎవరు ఎక్కడ చెప్పులు లేకుండా నడిచినా వాటి ఉపయోగాలు మాత్రం చాలా ఉన్నాయని అంటున్నారు.

ప్రకృతి స్పర్శను అనుభవించడం అంటే నేల తగిలేలా కాలు కింద పెట్టి భూమికి ఉన్న రకరకాల స్వభావాలు తాకుతూ ఉంటే ప్రకృతితో ఒక బంధం ఏర్పడుతుంది. ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే కళ్ళు నెత్తికెక్కి ఉంటే అవి కిందికి దిగుతాయి కూడా.. కాలి నడక వల్ల భూమిలోని నెగిటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. మన నిత్యం వాడే ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల శరీరంలో పేర్కొన్న అయాన్లను ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. ఇలా బ్యాలెన్స్ అవడం వల్ల శరీరంలో ఉన్న వాపులు తగ్గుతాయి. నిద్ర బాగా పట్టేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పులు లేకుండా ఖాళీ పాదాలతో నడవడం వల్ల పాదాలలో ఉండే నరాలు క్రమబద్దంగా తాకిడికి గురై దానివల్ల ఒత్తిడి దూరమయ్యే అవకాశం ఉంటుందని.. శరీరం పూర్తిగా సేద తీరిన భావన కలుగుతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. పాదంపై ఒత్తిడి పెంచడం వల్ల రక్తప్రసరణలో చురుకుతనం వచ్చి గుండెకి ఎంతో మేలు జరుగుతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..