TS Weather Report: తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్..!

| Edited By: Shiva Prajapati

Jul 09, 2021 | 3:58 PM

TS Weather Report: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

TS Weather Report: తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్..!
Weather
Follow us on

TS Weather Report: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నాడు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ఉపరిత దరోణి ఈ రోజు బలహీన పడిందన్నారు. ఇవాళ తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి/ షీర్ జోన్20°ఉత్తరం వద్ద సముద్ర మట్టం నుండి 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉందన్నారు. అల్పపీడనం ఈ నెల 11వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం&వాయువ్య బంగాళా ఖాతం పరిసరాలలోలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర ఏర్పడే అవకాశం వుందన్నారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వాతావరణ అధికారుల రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి, రెండు ప్రాంతాలలో కురిసే చాన్స్ ఉంది. అలాగే రాగల రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉంది.

ఇక ఈ నెల 11వ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో 11, 12, 13 వ తేదీలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Also read:

WhatsApp: అప్పటి వరకు ఒత్తిడి.. ఆంక్షలు ఉండవు.. ప్రైవసీ పాలసీపై కోర్టుకు వివరించిన వాట్సాప్

Nellore: నెల్లూరులో దారుణం.. 17 రోజుల పసికందును నీటి ట్యాంక్‌లో పడేసి చంపేశారు…

MS Dhoni: దిగ్గజాల జెర్సీలను భద్రపరచాలి.. ఇతర ఆటగాళ్లు వాడకుండా చూడాలి: మాజీ క్రికెటర్ సాబా కరీం