Cyber Fraud: ఇదో కొత్త స్కామ్.. మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి.. మస్తుగా దోచేశారు..!

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు అప్‌డేట్ అవుతున్నారు. జనాల్ని చీట్ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా మరో వెరైటీ సైబర్ మోసం వెలుగు చూసింది. మహారాష్ట్ర మాజీ సీఎం పేరుతో.. చీట్ చేశారు దుండగులు.

Cyber Fraud: ఇదో కొత్త స్కామ్.. మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి.. మస్తుగా దోచేశారు..!
Cyber Crime
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 02, 2024 | 4:27 PM

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు అప్‌డేట్ అవుతున్నారు. జనాల్ని చీట్ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా మరో వెరైటీ సైబర్ మోసం వెలుగు చూసింది. మహారాష్ట్ర మాజీ సీఎం పేరుతో.. చీట్ చేశారు దుండగులు. మాదకద్రవ్యాలు, మర్డర్ కేసులో కుటుంబీకులను అరెస్ట్ చేస్తామని బెదిరించిన కేటుగాళ్లు.. ఓ వివాహిత నుంచి ఏకంగా 40 లక్షల రూపాయలు కాజేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్ మహానగరంలో నివాసం ఉండే ఓ గృహిణి(40)కి.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఫోన్ వచ్చింది. వారు.. సదరు గృహిణి ఆధార్ నంబర్‌తో MDMA మాదకద్రవ్యాల పార్శిల్ వచ్చిందని చెప్పుకొచ్చారు. వివరాలు అడుగుతుండగానే.. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు కాల్ కనెక్ట్ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. అనంతరం మహారాష్ట్ర మాజీ సీఎం ఫోటో పంపి, అతనికి వరల్డ్ వైడ్ సంబంధాలు ఉన్నాయని భయబ్రాంతులకు గురిచేశారు. తాము చెప్పినంత అమౌంట్ పంపకపోతే.. కుటుంబ సభ్యల అందరి బ్యాంకు అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, అదుపులోకి తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు.. వారు చెప్పిన అకౌంట్లకు రూ.40 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించి.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్స్ వచ్చాయి.. మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.. మీ కుమారుడు గంజాయి కేసులో దొరికాడు. అత్యాచారం చేసినట్లు నీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇలా రకరకాలు కారణాల చెబుతూ మీకు కాల్స్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. జనాల్ని నమ్మించేందుకు కావాల్సిన సెటప్ అంతా చేస్తారు. ఇలాంటి బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. బ్యాంక్​ పేరుతో ఏ మెసేజ్‌లు, కాల్స్​ వచ్చినా.. ఎటువంటి సమాచారం ఇవ్వకూడదు. సైబర్ మోసగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..