Charminar Watch: చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?

చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభించారు ఆర్కియాలజీ విభాగం సిబ్బంది. మరమ్మతు పనుల్లో భాగంగా నిన్న తూర్పు వైపున ఉన్న క్లాక్ ధ్వంసమైంది. పైప్‌లు తీస్తుండగా 135 ఏళ్ల నాటి గడియారానికి ఆ పైపులు తగిలాయి. దీంతో డయల్‌ బోర్డు దెబ్బతిన్నది. వెంటనే రంగంలోకి దిగిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు చేస్తోంది. పాక్షికంగా ధ్వంసమైనా గడియారం పని చేస్తూ సరైన సమయాన్ని సూచిస్తోంది.

Charminar Watch: చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?

|

Updated on: Aug 02, 2024 | 6:00 PM

చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభించారు ఆర్కియాలజీ విభాగం సిబ్బంది. మరమ్మతు పనుల్లో భాగంగా నిన్న తూర్పు వైపున ఉన్న క్లాక్ ధ్వంసమైంది. పైప్‌లు తీస్తుండగా 135 ఏళ్ల నాటి గడియారానికి ఆ పైపులు తగిలాయి. దీంతో డయల్‌ బోర్డు దెబ్బతిన్నది. వెంటనే రంగంలోకి దిగిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు చేస్తోంది. పాక్షికంగా ధ్వంసమైనా గడియారం పని చేస్తూ సరైన సమయాన్ని సూచిస్తోంది. చార్మినార్.. అంతర్జాతీయ చారిత్రక కట్టడం. చార్మినార్‌కే కాదు, దాని మీదున్న గడియారాలకు కూడా ఘన చరిత్ర ఉంది. చారిత్రక కట్టడానికి నాలుగు వైపులా గడియారాలు ఉంటాయి. 1889లో చార్మినార్‌కు నలువైపులా గడియారాలను అమర్చారు. వీటిని నాటి పాలకులు లండన్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. నేటికీ ఆ గడియారాలు సమయాన్ని కరెక్ట్ గానే చూపిస్తున్నాయి. 24 గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇవ్వడం వల్ల అవి సరైన టైంను తెలియజేస్తున్నాయి. 135 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న పురాతన గడియారం ప్లేస్‌లో కొత్తది అమర్చుతారా? లేక దానికే రిపేర్ చేస్తారా అన్న సందేహం వీడింది. ఉన్నదానికే రిపేర్లు చేపట్టారు. రిపేర్లకు సంబంధించిన పూర్తి వివరాలు చార్మినార్ నుంచి మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us