Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. పిల్లలను చంపి ప్రాణాలు తీసుకున్న తల్లిదండ్రులు..
Hyderabad: భాగ్యనగరంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆందోళనకు గురైన దంపతులు.. తమ పిల్లలకు విషమిచ్చి, తామూ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భాగ్యనగరంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆందోళనకు గురైన దంపతులు.. తమ పిల్లలకు విషమిచ్చి, తామూ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సతీష్, వేద దంపతులు. సతీష్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే, వీరికి నిషికేత్, నిహాల్ పిల్లలు ఉన్నారు. కుషాయిగూడ పీఎస్ పరిధిలోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురవుతున్నారు. దాంతో మనస్తాపానికి గురైన దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో పిల్లలకు విషం ఇచ్చి చంపిన దంపతులు.. ఆ తరువాత వారు కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..