జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కోడ్ ఉల్లంఘన.. ఎన్ని కేసులు నమోదు అయ్యాయో తెలుసా?
తెలంగాణ రాజకీయమంతా... ఇప్పుడు జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతోంది. పాలక, ప్రతిపక్షాలు సవాల్‌గా తీసుకున్న ఈ ఉప ఎన్నిక .. రాష్ట్ర రాజకీయాల్లో ఉడుకు పుట్టిస్తోంది. చిన్న పెద్దా లీడర్లు.. గల్లీ టు ఢిల్లీ నాయకులు.. ఇక్కడే వాలిపోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటలు పుట్టిస్తోంది.

తెలంగాణ రాజకీయమంతా… ఇప్పుడు జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతోంది. పాలక, ప్రతిపక్షాలు సవాల్‌గా తీసుకున్న ఈ ఉప ఎన్నిక .. రాష్ట్ర రాజకీయాల్లో ఉడుకు పుట్టిస్తోంది. చిన్న పెద్దా లీడర్లు.. గల్లీ టు ఢిల్లీ నాయకులు.. ఇక్కడే వాలిపోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటలు పుట్టిస్తోంది. మరోవైపు ఉప ఎన్నిక సజావుగా జరిపించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన 58 ఎఫ్‌ఐఆర్‌లు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నమోదు చేశారు. వీటిలో 14 కేసులు పోటీలో ఉన్న అభ్యర్థులపై ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, పలువురు పార్టీ కార్యకర్తలపై 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, ద్వేషపూరిత కంటెంట్ వ్యాప్తి, అక్రమ సమావేశాలు, ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు లేదా బహుమతుల ప్రలోభాలు వంటి ఆరోపణలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
మొత్తం 58 కేసుల్లో మూడు కేసులు నిత్యావసర వస్తువుల చట్టం కింద నమోదయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై వచ్చింది. ఆయన నకిలీ ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పై కేసు నమోదైంది. యువతను ఆకర్షించేందుకు యూసుఫ్‌గూడలో నిర్వహించిన ఒక వేడుకలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బహుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకో ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్తలు జమా మసీదు వద్ద ప్రలోభాలు కల్పించారనే ఫిర్యాదు నమోదైంది. బీఆర్ఎస్ చిహ్నంతో కూడిన దుస్తులు ధరించి కేటీఆర్ పోస్టర్లతో ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వివరాలు ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు కూడా ఫిర్యాదులు అందాయి.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపైన కేసులు నమోదు చేశారు. అక్టోబర్ 16న సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు వ్యాప్తి చేసి వారిపై పలు ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి. నటి ఫోటోలను ఉపయోగించి ఫేక్ పోస్టులు చేసినందుకు 5 కేసులు నమోదయ్యాయి. మరో ఫిర్యాదులో రాజకీయ నేతల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఆరోపించారు. అక్టోబర్ 18న బీఆర్ఎస్ కార్యకర్త దుర్గం ప్రదీప్‌పై ‘అరాచక హస్తం’ పేరుతో ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు చేసినందుకు కేసు నమోదైంది. అలాగే అక్టోబర్ 21న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ కాంగ్రెస్ నాయకుడు ఓటర్లకు మొబైల్ ఫోన్ బహుమతిగా ఇస్తున్నట్లు చూపించడంతో, ఆ వీడియో ఆధారంగా మరో కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




