Hyderabad: పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

చీర కట్టుకోలేదని నిండు జీవితాన్ని చిదమేశాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పంజాబీ డ్రెస్‌ వేసుకున్నందుకు భార్యను చంపేశాడు. ఇంట్లో జరిగిన గొడవతో తనపై దాడి చేసి కత్తితో పొడుచుకుని చనిపోయిందంటూ మొసలికన్నీళ్లు కార్చాడు. కానీ కత్తిపోటు అసలు నిజాన్ని బయటపెట్టింది.

Hyderabad: పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
Crime News
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 15, 2024 | 9:31 AM

చీర కట్టుకోలేదని నిండు జీవితాన్ని చిదమేశాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పంజాబీ డ్రెస్‌ వేసుకున్నందుకు భార్యను చంపేశాడు. ఇంట్లో జరిగిన గొడవతో తనపై దాడి చేసి కత్తితో పొడుచుకుని చనిపోయిందంటూ మొసలికన్నీళ్లు కార్చాడు. కానీ కత్తిపోటు అసలు నిజాన్ని బయటపెట్టింది.

హైదరాబాద్‌ మహానగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన సోని అనే మహిళ అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. భర్త గుంజి వెంకటేష్‌ ఆమెతో గొడవపడ్డం ఇరుగుపొరుగు గమనించారు. అదంతా మామూలే అనుకున్నారు. కానీ గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లి చూస్తే, సోనీ ఒళ్లంతా గాయాలతో రక్తం మడుగులో పడి ఉంది. వెంకటేష్‌ చేతికి గాయాలయ్యాయి. వెంటనే 108కు పిలిపించిన స్థానికులు, ఇద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే సోనీ చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో సమాచారం అందుకున్న అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు బండారం బయటపడింది.

ఏం జరిగిందని ఆరా తీస్తే, గుంజి వెంకటేష్‌ ముసలి కన్నీరు కార్చాడు. మాటా మాటా పెరిగి తనపై కత్తితో దాడి చేసి, తనకు తాను పొడుచుకుని చనిపోయిందని నమ్మబలికాడు. కానీ సోనీ వీపు భాగంపై కత్తిపోటు గాయాలు స్పష్టంగా వుండడం గమనించారు పోలీసులు. గుంజి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే, అసలు నిజం బయటపడింది. అనుమానం పెనుభూతమై భార్యను చంపడమే కాకుండా, తన కన్నింగ్‌ బ్రెయిన్‌తో కేసును తప్పుదోవ పట్టించబోయాడు. కానీ పప్పులుడకలేదు. పోలీసుల విచారణలో నిజాలు బయటపడ్డాయి.

గుంజి వెంకటేష్‌- సోనీ దంపతులు ఉపాధి కోసం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. కొత్తపేటలో వుంటున్నారు. వెంకటేష్‌ మేస్త్రీ పనలు చేసేవాడు. భర్తకు చేదోడువాదోడుగా సోనీ.. నాలుగైదు ఇళ్లలో పనిచేసేది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కుటుంబం అంతా మొదట్లో బాగానే ఉండేవాళ్లు. కానీ గత కొన్ని నెలలుగా భార్యను అనుమానిస్తూ గొడవపడేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. ఈక్రమంలోనే పంజాబీ డ్రెస్‌ ఎందుకు వేసుకున్నావని గొడవ పడ్డాడు వెంకటేష్. దీంతో ఏకంగా నిండు ప్రాణం తీసేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగి తానే కత్తితో పొడుచుకుందని.. అడ్డుకునే ప్రయత్నంలో తనకు గాయాలయ్యాయని కహానీలు విన్పించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో కథ అడ్డం తిరిగింది. పక్కా ఆధారాలతో నిందితుడు గుంజి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..