AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓ ఇంట్లో నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నిప్పు వెనుక భగ్గుమన్న నిజం.. భార్య, ప్రియుడిపై..

వాళ్లిద్దరిదీ పెద్దలు కుదర్చిన పెళ్లి. ఏడేళ్ల కాపురంలో 2 ఏళ్లు ఆల్‌ హ్యాపీస్‌. కానీ ఐదేళ్లుగా కొంప కొల్లేరు అవుతూ వచ్చింది. అందుకు కారణం భర్త మద్యం వ్యసనంతో..

Hyderabad: ఓ ఇంట్లో నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నిప్పు వెనుక భగ్గుమన్న నిజం.. భార్య, ప్రియుడిపై..
Petrol Attack On Wife
Shiva Prajapati
|

Updated on: Nov 09, 2022 | 7:00 AM

Share

వాళ్లిద్దరిదీ పెద్దలు కుదర్చిన పెళ్లి. ఏడేళ్ల కాపురంలో 2 ఏళ్లు ఆల్‌ హ్యాపీస్‌. కానీ ఐదేళ్లుగా కొంప కొల్లేరు అవుతూ వచ్చింది. అందుకు కారణం భర్త మద్యం వ్యసనంతో పాటు అనుమానం. పదే పదే అంటే అబద్దం కూడా నిజమవుతుందంటారు కదా. వాళ్ల కాపురంలోనూ అదే జరిగింది. కట్‌ చేస్తే నారాయణగూడలో పెట్రో అటాక్‌ సంచలనం. దారుణం ఏంటంటే పెద్దలు చేసిన నేరానికి అభంశుభం తెలియని చిన్నారి బాధితురాలు అవడం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగుల సాయి, ఆర్తి భార్యా భర్తలు. బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి.. నారాయణగూడలో చిన్నా చితక పనులు చేసుకునేవాళ్లు. నాగుల సాయి మద్యానికి బానిస కావడంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఎవరితో మాట్లాడినా సరే అనుమానంతో వేధించేవాడు. ఆక్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి ఎవరికి వారు విడిగా వుంటున్నారు. ఐతే నాగరాజు అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండడం నాగుల సాయి కంటపడింది. కోపంతో రగిలిపోయాడు. వేధింపులు మరింత శృతిమించాయి. ఇక భరించలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందామె. కోర్టును కూడా ఆశ్రయించింది.

అయితే, ఇటీవల నాగరాజుకు నాగుల సాయికి మధ్య గొడవ జరిగింది. ఆర్తి జోలికి వెళ్తే బావుండదని వార్నింగ్‌ ఇచ్చాడు నాగరాజు. అంతే తనతో విభేదించి నాగరాజుతో సహజీవనం చేస్తుందన్న కోపంతో దారుణానికి తెగించాడు నాగుల సాయి. ఆర్తి, నాగరాజు కలిసి ఉన్న సమయం చూసి వారిద్దరిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తేరుకునేలోపే మంటలు భగ్గుమన్నాయి. ఈ ఘటనలో చిన్నారికి కూడా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నాగుల సాయిని అరెస్ట్ చేశారు. మద్యం వ్యసనం.. అనుమానం వెరసి నాగుల సాయి ఇంత దారుణానికి పాల్పడ్డాడు.అభంశుభం తెలియని చిన్నారికి గాయాలు కావడం అందర్నీ కలిచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..