Telangana: మిడ్ మానేరులో వల వేసిన జాలరి.. పైకి లాగి చూడగా.. అమ్మ బాబోయ్..
జాలర్లు ఎంత ఆశగా వల వేస్తారు. గంగమ్మకు మొక్కి.. మంచి జల సంపద చిక్కాలని ఆరాటపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మంచి మంచి చేపలు పడి అదృష్టం కలిసి వస్తుంది. కానీ కొన్నిసార్లు సరైన చేపల చిక్కక నిరాశ ఎదురవుతుంది. తాజాగా ఓ జాలరికి మాత్రం పంట పడింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జాలరి గోలాడ నరేశ్ ప్రతి రోజు మాదిరిగానే మిడ్ మానేరుకు చేపల వేటకు వెళ్లాడు. అయితే ఆదివారం అతని లక్ తిరిగిపోయింది. గంగమ్మకు గట్టిగా మొక్కి వల వేసనట్టున్నాడు. ఈసారి తన వలలో ఏకంగా 32.5 కిలోల బొచ్చ చేప చిక్కింది. వేసిన వల ఎంత లాగిన బయటకు రాలేకపోవడంతో.. ఇద్దరు కలిసి బలవంతంగా లాగగా అతి కష్టం మీద బయట వచ్చింది. అందులో భారీ చేపను చూసి..ఎంతో ఆనందపడ్డాడు జాలరి నరేశ్.
వల వేసిన తర్వాత లాగేటప్పుడు బరువుగా అనిపించడంతో ఒకింత ఆందోళన చెందాడు నరేష్. వల ఎక్కడ చినిగి పోతుందోనని భయపడ్డాడు. బయటకు లాగినప్పుడు చిక్కిన ఆ చేపను, బరువును చూసి ఆశ్చర్యపోయారు. ఈ భారీ చేపను సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీశాడు. ఇంత భారీ చేపలు సహజంగా మిడ్ మానేరులో లభించవని స్థానికులు చెబుతున్నారు.
ఈ భారీ చేప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ చేపను చూడటానికి ఆసక్తిక కనబరిచారు. చేపని చూసిన గ్రామస్తులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద పెద్ద చేపలు సాధారణంగా సముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ చేపను ప్రత్యక్షంగా చూడటం ప్రత్యేక అనుభూతి అని చెబుతున్నారు. కొన్ని గంటల పాటు ఆయన ఇంటి ఎదుటే చేపను ఉంచగా, గ్రామస్తులు పదుల సంఖ్యలో వచ్చి చూస్తూ… ఫొటోలు వీడియోలు తీసుకున్నారు.

Huge Fish
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
