AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ కార్పొరేట్ రంగం రూపురేఖలు మార్చడంలో కంపెనీ సెక్రటరీల కీలక పాత్రః కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటేరియస్‌ ఆఫ్‌ ఇండియా భవన నిర్మాణానికి కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి భూమిపూజ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా కంపెనీ సెక్రటరీలు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

దేశ కార్పొరేట్ రంగం రూపురేఖలు మార్చడంలో కంపెనీ సెక్రటరీల కీలక పాత్రః  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Union Minister G.kishan Reddy
Balaraju Goud
|

Updated on: Apr 20, 2025 | 5:20 PM

Share

హైదరాబాద్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటేరియస్‌ ఆఫ్‌ ఇండియా భవన నిర్మాణానికి కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి భూమిపూజ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా కంపెనీ సెక్రటరీలు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. . ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటేరియస్‌ ఆఫ్‌ ఇండియా నూతన భవన నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఖైరతాబాద్‌లో ICSI హైదరాబాద్‌ చాప్టర్ బిల్డింగ్‌కు నిర్మాణానికి భూమిపూజ చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈ సందర్భంగా.. దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కంపెనీ సెక్రటరీలు కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కు ICSI హైదరాబాద్‌ చాప్టర్ కీలక ఘట్టమని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి కావడం సంతోషకరమని చెప్పారు.

ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు విలువలను పాటిస్తూ పారదర్శకంగా చట్టాలను అనుసరించేలా చేస్తూ దేశ కార్పొరేట్ గవర్నెన్స్‌కు కంపెనీ సెక్రటరీలు వెన్నెముకలా నిలిచారన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్కృతిని పెంపొందించడంతోపాటు దేశీయ వ్యాపారంపై నమ్మకం కలిగేలా చేశారని ప్రశంసించారు. ఈ నమ్మకంతోనే దేశవిదేశాల పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే.. 2047 నాటికి భారత్.. వికసిత భారత్‌గా ఎదిగేందుకు.. ప్రపంచ దేశాల్లో వ్యాపార రంగం అభివృద్ధి చెందేందుకు ICSIలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కిషన్‌రెడ్డి.

ఇక.. ఇప్పటికే భారత్‌ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మరో రెండేళ్లలోనే 5 బిలియన్ మార్క్ దాటనుందని, కంపెనీ సెక్రటరీల ప్రొఫెషనల్ హార్డ్ వర్క్, అంకితభావం, విలువలతో కూడిన వ్యాపారం వల్లే ఇది సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..