AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఏం చేయాలి?

Cyber Crime: ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ప్రతి జోన్ కు ఒక సైబర్ సెల్ ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్ కు ఒక్కో సైబర్ సెల్ ను..

Cyber Crime: సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఏం చేయాలి?
Lakshmi Praneetha Perugu
| Edited By: Subhash Goud|

Updated on: May 29, 2025 | 7:05 PM

Share

సాధారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు సైబర్ నేరస్తుల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మనకు తెలియకుండానే మన ఖాతా నుండి డబ్బులు పోతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా కరోనా తర్వాత ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆన్లైన్లో పెట్టుబడిన పేరుతో ఎక్కడో మారుమూల గ్రామంలో కూర్చుని సైబర్ నేరస్థుడు మన బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు కొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ మన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి.

అయితే చాలామంది సైబర్ నేరస్తుల బారినపడి తమ డబ్బులు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పోగొట్టుకున్న ఈ డబ్బును తిరిగి బాధితులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయలు సైతం పోగొట్టుకున్న బాధితులకు వాటిని తిరిగి అప్పజెప్పిన దాఖలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా సుమారు సగటున 20కి పైగా ఫైబర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో సైబర్ క్రైమ్ చూసే పోలీసుల సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో కేసుల ఫాలోఅప్ లేక బాధితులకు అందాల్సిన డబ్బు చేరటం లేదు.

ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ప్రతి జోన్ కు ఒక సైబర్ సెల్ ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్ కు ఒక్కో సైబర్ సెల్ ను ఏర్పాటు చేశారు. ఈ సైబర్ సెల్ ద్వారా ఒకవేళ మీరు సైబర్ నేరాల బారిన పడి పోగొట్టుకున్న డబ్బు 25 వేల రూపాయల లోపు ఉంటే ఈ సైబర్ సెల్ పోలీసులు ఆ డబ్బును మీకు అందించే మార్గంలో సహాయపడతారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి మీరు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దానిని సైబర్ సెల్ పోలీసులు ఫాలో అప్ చేసి నిందితుల నుండి డబ్బులు రికవరీ చేసి కోర్టు నుండి ప్రాసెస్ స్పీడ్ అప్ అయ్యేలాగా సైబర్ సెల్ పోలీసులు సహాయపడనన్నారు.

ఒకవేళ మీరు పోగొట్టుకున్న డబ్బు 25 వేల రూపాయల పైబడే ఉంటే నేరుగా సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి.1930 నెంబర్ కు ఎలాంటి సైబర్ క్రైమ్ జరిగిన ఫిర్యాదు చేయవచ్చు. ఈ పోర్టల్ కు వచ్చే ఫిర్యాదుల పై ప్రతి రోజు సైబర్ సెల్ పోలీసులు అర్హత కలిగిన కేస్‌లపై ఫాలో అప్ చేస్తారు. మీ డబ్బు తక్కువ మొత్తంలో పొయి ఉంటే ఆ డబ్బును హోల్డ్ చేసి ఉంటే కనుక సైబర్ సెల్ పోలీసులు వాటిని తిరిగి మీకు అప్పజెపుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..