AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical seats: తెలంగాణలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత ఏర్పాటైన 34 వైద్య కళాశాలల్లోని సీట్లలో 85 శాతం కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే వర్తింస్తాయని హైకోర్టు స్పష్టం సోమవారం రోజున చేసింది. అఖిల భారత కోటా 15 శాతంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతంర ఏర్పాటైన కళాశాలల్లో సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జులై 3వ తేదీన తీసుకొచ్చిన జీవో 72ను సమర్థించింది.

Medical seats: తెలంగాణలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే
TS High Court
Aravind B
|

Updated on: Sep 12, 2023 | 8:01 AM

Share

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత ఏర్పాటైన 34 వైద్య కళాశాలల్లోని సీట్లలో 85 శాతం కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే వర్తింస్తాయని హైకోర్టు స్పష్టం సోమవారం రోజున చేసింది. అఖిల భారత కోటా 15 శాతంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతంర ఏర్పాటైన కళాశాలల్లో సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జులై 3వ తేదీన తీసుకొచ్చిన జీవో 72ను సమర్థించింది. మరోవైపు ఈ జీవో 72ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 60కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు. అయితే పిటీషన్లను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టీస్ ఎన్‌.వి శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అలాగే వైద్య ప్రవేశాలకు సంబంధించిన 2017 నిబంధనలను సవరించే అధికారం.. తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

అయితే ఈ నిబంధనలు కేవలం పార్లమెంట్ మాత్రమే సవరించాలని.. శాసనసభకు అధికారం ఉండదని చెప్పడం కేవలం అపోహా మాత్రమేనని తెలిపింది. ఇక సవరించిన నిబంధనల ప్రకారం చూసుకుంటే 85 శాతం కాంపిటెంట్ అథారిటీ సీట్లను స్థానికులకు వర్తింపజేయడం రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 5,6 పేరాల ప్రకారం విరుద్ధమేమి కాదని పేర్కొంది. అలాగే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం… ఆంధ్ర, తెలంగాణల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, మెడికల్ విద్యా కోర్సుల్లో పదేళ్లపాటు ఇరురాష్ట్రాలకు అవకాశం కల్పించాలని ఉంది. అయితే ఇది.. 2014 జూన్ 2 నాటికి ఉన్న అడ్మిషన్ కోటా ప్రకారమేనని తెలిపింది. కానీ 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు అయిన విద్యా సంస్థలకు ఈ సెక్షన్ వర్తించదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశాల నిబంధనలను సవరించినటువంటి నేపథ్యంలో సెక్షన్ 95 కింద ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎలాంటి చట్టపరమైన హక్కును పొందలేరని చెప్పింది.

చట్టాలకు విరుద్ధంగా చట్టబద్ధమైన హక్కులను పొందాలనుకోరాదని చెప్పింది. ఇక మార్చి 6న నీట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత జూన్ 3న నిబంధనలకు సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం అనేది ఆట మొదలయ్యాక నిబంధనలు మార్చడం ఏంటి అన్న వాదనపై కూడా ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్లు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లు చెప్పింది. ఇక మెడికల్ అడ్మిషన్ల నిమిత్తం కాళోజీ వర్సిటీ జూన్ 6న నోటిఫికేషన్ విడుదల చేసిందని.. అంటే అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకాకమునుపే నిబంధనల సవరణ జరిగిందని స్పష్టం చేసింది. 100 శాతం రిజర్వేషన్ చెల్లదంటూ గతంలో ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పు వాస్తవానికి ఉద్యోగాలకు సంబంధించినదని.. విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు వర్తించవని పేర్కొంది. అలాగే మెడికల్ అడ్మిషన్లలో కూడా 100 శాతం రిజర్వేషన్లు లేవని.. 15 శాతంలో ఆలిండియా కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడొచ్చని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..