Hyderabad Rains: భారీ వర్షాలకు భాగ్యనగర వాసుల జీవనం అస్తవ్యస్తం.. కుప్పకూలుతున్న భారీ వృక్షాలు..

| Edited By: Ravi Kiran

May 01, 2023 | 10:17 AM

హైదరాబాద్ లో అర్ధరాత్రి దంచికొట్టిన వర్షానికి మారేడు పల్లి ప్రాంతంలోని మిలటరీ ఏరియాలో ఓ భారీ వృక్షం నేలకూలింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో రాత్రి నుండి AOC లో రాకపోకలు నిలిచిపోయాయి

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓ వైపు ఎండలు దంచికొడుతూనే.. అకస్మాత్తుగా వాతావరణం మారి.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొంతకాలంగా ఎప్పుడు ఎండలు వస్తాయో.. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత రాత్రి  హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతలోనే అర్ధరాత్రి దాటక మరోమారు వర్షం కుమ్మేసింది. మారేడుపల్లి మిలటరీ ఏరియా, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, బోరబండ, ఫిలింనగర్, బంజారాహిల్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా మూసాపేట, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అర్ధరాత్రి దంచికొట్టిన వర్షానికి మారేడు పల్లి ప్రాంతంలోని మిలటరీ ఏరియాలో ఓ భారీ వృక్షం నేలకూలింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో రాత్రి నుండి AOC లో రాకపోకలు నిలిచిపోయాయి. అంత పెద్ద వృక్షం ఇళ్లపైన పడకుండా రోడ్డువైపు పడటంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డు పక్కన పార్క్‌చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి