AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: కేంద్రమంత్రి నిర్మలకు హరీశ్ రావు సవాల్.. అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేకపోతే మీరు చేస్తారా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో లేదని చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధాని ఫొటోను రేషన్‌ దుకాణంలో పెట్టాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Harish Rao: కేంద్రమంత్రి నిర్మలకు హరీశ్ రావు సవాల్.. అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేకపోతే మీరు చేస్తారా?
Harish Rao Nirmala Sitharaman
Shaik Madar Saheb
|

Updated on: Sep 02, 2022 | 3:34 PM

Share

Harish Rao’s challenge to Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై.. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.. అసలు, కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు డబ్బులు తెలంగాణ నుంచి వెళ్తున్నాయంటూ ఘాటుగా రియాక్టయ్యారు. అలాంటప్పుడు కేంద్ర పథకాలకు సీఎం కేసీఆర్‌ బొమ్మ ఎందుకు పెట్టరంటూ తాము అడగకూడదా అంటూ.. హరీశ్ రావు విమర్శించారు. నిన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో లేదని చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధాని ఫొటోను రేషన్‌ దుకాణంలో పెట్టాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చే విధంగా కేంద్ర మంత్రులు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మెదక్‌ జిల్లాలోని తుప్రాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన హరీశ్‌ రావు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిర్మలా సీతారమన్ అసత్యాలు మాట్లాడారని.. పార్లమెంట్ వేదికగా చెప్పింది గుర్తులేదా అంటూ హరీశ్ రావు మండిపడ్డారు. తాము నిజాలను చెబుతుంటే.. కేంద్ర మంత్రులు అసత్యాలు ప్రచారం చేసే పనిలో పడ్డారన్నారు. తెలంగాణలో పథకాలను కేంద్రమే కాపీ కొట్టిందని పేర్కొన్నారు. ఉచిత బియ్యం కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. అలాంటప్పుడు మోడీ ఫొటో ఎలా పెడతామంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌లో చేరలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. చేరినట్లు తాము నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారా..? అంటూ హరీశ్ రావు నిర్మలా సీతారామన్‌కు సవాల్‌ చేశారు. మాట్లాడిన అబద్దాలపై తప్పు ఒప్పుకోవాలని.. క్షమాపణ చెప్పాలంటూ మంత్రి డిమాండ్ చేశారు. దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి