Watch Video: గల్ఫ్ కార్మికుల స్పెషల్ బోర్డు కోసం ఆమరణ నిరాహార దీక్ష.. వీడియో
దుబాయ్ వేదికగా గల్ఫ్ కార్మికుల నిరసన చేపట్టారు. ఇందులో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధనే ధ్యేయంగా దుబాయ్ GWAC ఆధ్వర్యంలో నిరసన జరిగింది. వచ్చే బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల..
దుబాయ్ వేదికగా గల్ఫ్ కార్మికుల నిరసన చేపట్టారు. ఇందులో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధనే ధ్యేయంగా దుబాయ్ GWAC ఆధ్వర్యంలో నిరసన జరిగింది. వచ్చే బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం నిధుల కేటాయించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని NRI బృందం హెచ్చరించింది.
ఈ సందర్భంగా మూడు ప్రధాన డిమండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అవేంటంటే. గల్ఫ్ కార్మికుల సంపూర్ణ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి. వచ్చే బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి. గల్ఫ్ లో చనిపోయిన వాళ్ళకి, ఎక్గ్రేసియా 5 లక్షల రూపాయలు అందనివాళ్ళకు తొందరగా అందజేయాలి. తొందరగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయకపోతే అమరణనిరాహర దీక్షకు చేస్తామని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
మరిన్నితెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




