Watch Video: ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది.. మరి సాగు చేతికొచ్చేనా..?

నిర్మల్ జిల్లాలో ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది. మూసుకున్న కెనాల్ గేట్లు షరతులతో కూడిన ఒప్పందంతో తెరుచుకోవడంతో పంటలకు పునర్జీవం పోసినట్టైంది. కరువు కోరలతో తెలంగాణ వర ప్రదాయినైన శ్రీరాంసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువవడంతో.. సాగుకు ఇవ్వలేమంటూ వారం రోజుల క్రితం అధికారులు చేతులెత్తేశారు. దీంతో కోతదశకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు.

Watch Video: ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది.. మరి సాగు చేతికొచ్చేనా..?
Sri Ram Sagar Project
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 12, 2024 | 12:16 PM

నిర్మల్ జిల్లాలో ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది. మూసుకున్న కెనాల్ గేట్లు షరతులతో కూడిన ఒప్పందంతో తెరుచుకోవడంతో పంటలకు పునర్జీవం పోసినట్టైంది. కరువు కోరలతో తెలంగాణ వర ప్రదాయినైన శ్రీరాంసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువవడంతో.. సాగుకు ఇవ్వలేమంటూ వారం రోజుల క్రితం అధికారులు చేతులెత్తేశారు. దీంతో కోతదశకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు. అటు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు ఎస్సార్ఎస్పీ నుండి నిర్మల్ జిల్లా సరస్వతి కెనాల్‎కు సాగు నీరొచ్చింది. 30 వేల ఎకరాల వరి పంటకు ప్రాణం పోసింది.

శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి సరస్వతి కెనాల్‌ ద్వారా ప్రతి ఏడాది 36 ఎకరాల్లో రెండు పంటలను పండిస్తున్నారు నిర్మల్ జిల్లా రైతాంగం. ఈ ఆయకట్టు కింద నిర్మల్ జిల్లాలోని సోన్‌, నిర్మల్‌ రూరల్‌, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్‌, పెంబి మండలాల్లో మండు వేసవిలోను వరి పంట పుష్కలంగా పండుతుంది. గతంలోలాగే ఈ యాసంగి సీజన్‌లోను 30 వేల ఎకరాలకుపైగానే వరిని సాగు చేశారు సరస్వతి కెనాల్ ఆయకట్టు రైతులు. 30 వేల ఎకరాల్లో దాదాపు 28 వేలకు పైగా ప్రస్తుతం పొట్టదశలో ఉన్నాయి పంటలు. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు‎లో వేసవి తాపానికి నీటి సామర్థ్యం భారీగా పడిపోయింది. డెడ్ స్టోరేజీకి చేరువవడంతో సాగుకు నీళ్లివ్వడం కష్టమని భావించిన ఎస్సార్ఎస్పీ అధికారులు ఉన్నపళంగా ఎలాంటి సమాచారం లేకుండా సరస్వతి కెనాల్‎కు సాగు నీటిని నిలిపి వేసింది. దీంతో ఈ ఆయకట్టు కింద పంట సాగు చేసిన రైతుల గుండెల్లో ఆందోళన మొదలైంది. మరో పది రోజులకు పైగా సాగునీరు సరఫరా అయితేనే పంటలు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కెనాల్‎కు సాగు నీరు నిలిచిపోవడంతో ఏం చేయాలో తెలియక స్థానిక ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నారు రైతులు. అయినా లాభం లేకపోవడంతో ఖానాపూర్ , కడెం మండలాల రైతులు రోడ్డెక్కారు. అటు నిర్మల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు సైతం తమ ప్రాంతం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని.. వెంటనే ఎస్సార్ఎస్పీ నుండి‌ సరస్వతి కెనాల్‎కు నీళ్లివ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా శ్రీరాంసాగర్ అధికారుల్లో చలనం లేకపోవడంతో ప్రాజెక్ట్‎ను ముట్టడిస్తామంటూ హెచ్చరించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరస్వతి ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేశారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం వారం రోజుల వరకు మాత్రమే సాగుకు నీళ్లు విడుదల చేస్తామని షరతులు పెడుతూ సాగు నీళ్లు విడుదల చేశారు అధికారులు. ఆ తర్వాత పంటలు ఎండిపోతున్నాయంటూ డిమాండ్ చేసినా లాభం లేదంటూ తేల్చి చెప్పారు. రైతులు మాత్రం ఈ షరతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తలాపున గోదారున్నా పంటలు ఎండి ఎడారవడమేనా అంటూ మండిపడుతున్నారు. ఈ కాలువ కింద ప్రస్తుతం 28 ఉపకాలువలు ఉన్నాయి. అయితే నిర్మల్‌ మండలం నుంచి ఖానాపూర్‌ మీదుగా కడెం వరకు దాదాపు 42 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే ఈ సరస్వతీ కాలువ ఉపకాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వారం రోజుల షరతులతో విడుదల చేసిన ఎస్సారెస్పీ సాగు నీళ్లు చివరికి పంటకు అందడం గగనమే అని తెలుస్తోంది. అయితే ఈ వారం రోజుల నీటి విడుదల ఘనత మాదంటే మాదంటూ అటు బీజేపీ, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ ఖయ్యానికి దిగడంపై రైతులు మరింత భగ్గుమంటున్నారు. సత్తా ఉంటే చివరి పంటకు నీళ్లొచ్చేదాక సాగునీటిని సరఫరా చేయండని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయానికి తమను బలి చేయకండంటూ ఇరు పార్టీలను వేడుకుంటున్నారు సరస్వతి కెనాల్ ఆయకట్టు రైతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..