Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్!
వినాయక చవితి, దసర నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరి ఈ సారి కూడా పర్మిషన్ తీసుకొని విగ్రాహలు ఏర్పాటు చేసే మండపాలను ఉచిత్ విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యుత్ శాఖ అధికారులకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

వినాయక చవితి దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు, హైదరాబాద్‌లో వినాయక చవిత ఉత్సవాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.ఇందులో భాగంగానే మంగళవారం MCRHRDలో గణేశ్ ఉత్సవాలపై వినాయక ఉత్సవ కమిటీ, అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో అనుతితీసుకొని ఏర్పాటు చేసే ప్రతి గణేష్ మండపానికి ఉచిత కరెంట్ అందించాలని ఆయన విద్యుత్ షాక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఎక్కడా సమస్యలు రాకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక చవితి ముగసే వరకు అన్ని శాఖల అధికారులు సమయన్యంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ లో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన ఆన్నారు. కాబట్టి గణపయ్యను ప్రతిష్టించిన రోజు నుంచి నిమ్మజ్జనం పూర్తయ్యే వరకు హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలానే ఖైరతాబాద్, సహా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బడా గణేష్ విగ్రహాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




