Property Tax: తెలంగాణా పురపాలక, నగర పాలక సంస్థల్లో ఆస్తి పన్ను చెల్లించేవారికి శుభవార్త! త్వరగా పన్ను చెల్లిస్తే టాక్స్ లో రాయితీ
లంగాణలో ఆస్తిపన్ను పై రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
Property Tax: ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను వసూలు చేయడం పురపాలికల్లో అధికారులకు కత్తిమీదసాము అవుతుంది. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించడం.. ఫైన్ లు వేస్తామని చెప్పడం వంటివి చేస్తూ పన్ను వసూళ్లు చేస్తుంటారు. దీంతో పాటు పన్ను చెల్లింపుల్లో రాయతీలు కూడా ప్రకటిస్తుంటారు. తాజాగా తెలంగాణలో ఆస్తిపన్ను పై రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణా రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగర పాలక సంఘాల పరిధిలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను అంటే 2021-22 సంబంధించిన ఆస్తి పన్నులో 5 శాతం రాయితీని ప్రకటించారు. ఎర్లీ బర్ద్ ఆఫర్ పేరిట ఈ రాయితీని ప్రకటించారు. ఈ రాయితీ పొందటానికి ఆస్తి పన్నును ఈ నెల 30వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మునిసిపల్ అధికారులకు తెలంగాణ పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. రాయితీల నేపథ్యంలో ఆస్తిపన్ను కట్టించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అయన సూచించారు. తెలంగాణలోని మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ రాయితీ అమలవుతుంది.