నిర్మాణ రంగంలో ‘మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ మహోన్నత ప్రస్థానం.. ‘మేక్‌ లివింగ్‌ బెటర్‌’ ప్రామిస్‌తో సక్సెస్‌ఫుల్‌గా 35 ఇయర్స్

My Home Constructions 35 Years Celebration : 'మేక్‌ లివింగ్‌ బెటర్‌' అనే వాగ్దానంతో సక్సెస్‌ఫుల్‌గా నిర్మాణరంగంలో సేవలందిస్తోన్న 'మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌' మరో శిఖరాన్ని..

నిర్మాణ రంగంలో 'మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌' మహోన్నత ప్రస్థానం.. 'మేక్‌ లివింగ్‌ బెటర్‌' ప్రామిస్‌తో సక్సెస్‌ఫుల్‌గా 35 ఇయర్స్
Rameswar Rao Jupally
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 08, 2021 | 11:15 PM

My Home Constructions 35 Years Celebration : ‘మేక్‌ లివింగ్‌ బెటర్‌’ అనే వాగ్దానంతో సక్సెస్‌ఫుల్‌గా నిర్మాణరంగంలో సేవలందిస్తోన్న ‘మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ మరో శిఖరాన్ని చేరుకుంది. నాణ్యమైన కన్‌స్ట్రక్షన్‌కు మారుపేరుగా.. ఒక భరోసాగా నిలుస్తూ ‘మై హోమ్‌ సంస్థ’ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తోంది. 1986లో డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌ రావు ప్రారంభించిన మై హో మ్‌ కన్‌స్ట్రక్షన్స్‌.. మహావృక్షంగా మారి.. ఇవాళ 35 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించుకుంది. ఈ వేడుకలో మై హోమ్‌ డైరెక్టర్లు, ఇతర సీనియర్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి సహా, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మై హోం సంస్థకు శుభాకాంక్షలు చెప్పారు.

35ఏళ్ల మైలురాయిని పురస్కరించకొని, మై హోమ్‌ సంస్థ ప్రస్థానాన్ని ఒక సారి పరికిస్తే, మై హోం కన్ స్ట్రక్షన్స్ 25కు పైగా ప్రాజెక్టుల ద్వారా 2 కోట్ల 70 లక్షల చదరపు అడుగుల ప్రాంగణాన్ని కస్టమర్లకు డెలివరీ చేసింది. ఈ ఏడాది చివరికల్లా 3 కోట్ల 50 లక్షల చదరపు అడుగుల ప్రాంగణాన్ని కవర్‌ చేస్తుందని మై హోమ్‌ చెబుతోంది. ఇప్పటిదాకా 10వేలకుపైగా కుటుంబాలకు నాణ్యమైన ఇళ్లు అందించింది మైహోమ్‌. అలాగే 50వేల మందికిపైగా ఉద్యోగులకు కూడా వసతికి అందించింది. హైదరాబాద్ కోకాపేటలో ఆసియాలోనే అతిపెద్ద ఆఫీస్‌ ప్రాంగణాలలో ఒకటైన వాణిజ్య ప్రాజెక్టును మై హోమ్‌ చేపడుతోంది. ఇక, తెల్లాపూర్‌లో అతిపెద్ద టౌన్‌షిప్‌ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో ఇళ్లను కొనుగోలు చేయడానికి మై హోమ్‌ శ్రీకారం చుట్టింది.

ఇంతటి సుదీర్ఘమైన ప్రస్థానంలో తనతో కలసి నడిచినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మై హోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు. సంస్థ వేడుకల్లో ఆయన వీడియో ద్వారా తన సందేశాన్ని అందించారు. “కాలగమనంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజల అంచనాలు పెరిగిపోయాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అదే మై హోమ్‌ గొప్పతనం. సమయానికి తగినట్లు, మమ్మల్ని మేం మెరుగుపరుచుకుంటూ, కొత్త టెక్నాలజీ ప్రవేశపెడుతూ.. నైపుణ్యం ఉన్నవారికి మై హోమ్‌ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇవన్నీ మమ్మల్ని విజయపథాన నడిపిస్తున్నాయి. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం” అని జూపల్లి రామేశ్వర్ రావు తెలిపారు.

“ఒకవైపు రెసిడెన్షియల్‌, మరోవైపు కమర్షియల్‌ ప్రాజెక్టుల ద్వారా నిర్మాణ రంగంలో మై హోమ్‌ తనదైన ముద్రను వేసుకుంది. నమ్మకానికి మారుపేరైన బ్రాండ్‌గా నిలిచింది. మై హోమ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు.. అంతర్జాతీయ స్థాయిలో వసతులకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. 2010లో మై హోమ్‌ జ్యువల్‌లో రెండువేలకు పైగా ఫ్లాట్స్‌తో అత్యాధునిక సౌకర్యాలతో గేటెడ్‌ కమ్యూనిటీని నిర్మించాం. వచ్చే ఐదేళ్లలో 40 మిలియన్‌ చదరపు అడుగుల నిర్మాణానికి తమ లక్ష్యం.” అన్నారు మై హోం గ్రూప్‌ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ రామూరావు జూపల్లి.

“కరోనా మహమ్మారి తర్వాత అద్దె ఇళ్లకు బదులుగా సొంతింటి కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో 10-15 ఏళ్ల కిందటితో పోల్చుకుంటే.. హైదరాబాద్‌ నిర్మాణరంగం వ్యవస్థీకృతంగా మారింది. అందుబాటు ధరల్లో ఇళ్లు, అత్యాధునిక సదుపాయాలతో కూడిన గృహాలను అందించడంలో బ్రాండ్‌కి ప్రాధాన్యం పెరిగింది. ఈ పరిస్థితుల్లో కొత్త మార్కెట్‌ కనిపిస్తోంది.” అని చెప్పారు మై హోం గ్రూప్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ రావు జూపల్లి.

అంతేకాదు, “ఇప్పటిదాకా మేం 27 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని అందించాం. 10వేల కుటుంబాలు మై హోమ్‌ను తమ ఇల్లుగా మార్చుకున్నాయి. ఇది మాకు చాలా ఆనందం కలిగించే విషయం. వచ్చే ఐదేళ్లకు మాకు పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి.” అని శ్యామ్ రావు జూపల్లి వెల్లడించారు. “నగరంలోకి ఐటీ నిపుణులు కూడా పెద్దఎత్తున వస్తున్నారు. మేం కొత్త మార్కెట్‌ను చూస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ హోమ్‌లోన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 10-15 ఏళ్ల క్రితంతో పోల్చితే రియల్‌ ఎస్టేట్‌ ఇప్పుడు పూర్తిగా వ్యవస్థీకృతమైన మార్కెట్‌. చాలా ప్రొఫెషనల్‌గా సేవలు అందిస్తున్నాం. ఎప్పటికైనా మై హోమ్‌లో ఇల్లు ఉండాలన్నది ప్రతి తెలుగువారి కోరిక.” అని శ్యామ్ రావు స్పష్టం చేశారు.

మై హోమ్‌ 35 ఏళ్ల ప్రస్థానంపై సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ కంగ్రాట్స్‌ చెప్పారు. మై హోమ్ గ్రూప్ ఒక నమ్మకమన్నారాయన.