AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharmila : తెలంగాణలో ఇవాళ మరో కొత్త పార్టీ ఆవిర్భావం .. లోటస్‌పాండ్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన షర్మిల

YS Sharmila new political party : ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడబోతోంది. తెలంగాణలో ఇవాళ మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది...

Sharmila : తెలంగాణలో ఇవాళ మరో కొత్త పార్టీ ఆవిర్భావం .. లోటస్‌పాండ్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన షర్మిల
Ys Sharmila
Venkata Narayana
|

Updated on: Apr 09, 2021 | 9:45 AM

Share

YS Sharmila new political party : ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడబోతోంది. తెలంగాణలో ఇవాళ మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. ఖమ్మంలో సాయంత్రం 5 వైఎస్‌ షర్మిల సంకల్ప సభ జరగనుంది. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచి కొంచెం సేపటి క్రితం ఖమ్మం సభకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు షర్మిల. మధ్యాహ్నం ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు. షర్మిలకు అడుగడుగునా స్వాగతం పలికేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు.

మార్గ మధ్యలో ప్రజలతో మమేకమవుతూ మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల ఖమ్మం చేరుకుంటారు. ఇవాళ జరిగే సంకల్ప సభలో వైఎస్‌ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదిస్తారు. ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్‌ అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని వైఎస్‌ అభిమానులతో గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు షర్మిల. ఆయా జిల్లాల్లోని సమస్యలు తెలుసుకుంటున్నారు.

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆరువేలమందితో సభ నిర్వహణకు పోలీసులు పర్మిషన్‌ ఇచ్చారు. మొదట గ్రాండ్‌గా ఈ సభ నిర్వహించాలనుకున్నారు షర్మిల. అయితే నిబంధనల ప్రకారమే సభ నిర్వహించుకుంటామని ప్రకటించారు షర్మిల అనుచరులు. వందమంది కూర్చునేలా స్టేజీని సిద్ధంచేశారు. వైఎస్‌ షర్మిలతో పాటు సభకు తల్లి విజయమ్మ కూడా హాజరవుతున్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి.. కేవలం తల్లిగా కూతుర్ని ఆశీర్వదించేందుకే ఖమ్మం సభకు వస్తున్నారని షర్మిల అనుచరులు చెబుతున్నారు.

పార్టీ ఏర్పాటు ప్రకటనకు ముందే…అన్ని జిల్లాల అనుచరులు, కలిసొచ్చిన నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు వైఎస్‌ షర్మిల. చివరిగా ఖమ్మం జిల్లా ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలోనే ఆమె భవిష్యత్తులో పాలేరు నుంచి పోటీచేస్తారనే ప్రచారం కూడా జరిగింది. పార్టీ జెండా, ఎజెండాతో పాటు తన ఆలోచనల్ని కూడా ఖమ్మం సభావేదికపై షర్మిల ఆవిష్కరించబోతున్నారు.

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే సభను నిర్వహిస్తామని వైఎస్‌ షర్మిల తెలంగాణా ఇన్‌చార్జ్‌ కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ సభకు వైఎస్‌ అబిమానులు భారీగా హాజరవుతారని.. 2004 నుంచి 2009 వరకు వైఎస్‌ఆర్‌ చేసిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. పార్టీ జెండా.. అజెండాను ప్రకటించిన తరువాతే తెలంగాణాలో సమస్యలపై పోరాడుతామంటున్నారు. అయితే పార్టీ పేరు ఏం ఉండబోతోంది ? పార్టీ జెండా ఏంటి ? ఎజెండా ఏంటి ? అనేది ఉత్కంఠ రేపుతోంది.

Read also: Caroline Jurie : శ్రీలంక 2021 విన్నర్‌ పుష్పిక డిసిల్వాను స్టేజ్ పై తీవ్రంగా అవమానించిన ఘటన.. మిసెస్‌ వరల్డ్‌ కరోలిన్‌ జూరీ అరెస్ట్