AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder Scheme: తెలంగాణలో రూ.500లకే గ్యాస్‌ సిలిండర్.. మరో నెల రోజుల్లో అమలు

అధికారం చేపట్టిన వెనువెంటనే రెండు గ్యారెంటీ స్కీములను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.500 సిలిండర్ పై దృష్టి పెట్టింది. ఆరు గ్యారంటీ స్కీముల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అమలు చేయబోతున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ మాత్రం ఆ రెండు పథకాలు అమలు చేసినంత ఈజీ కాదు. భారీ ఎత్తున నిధులు అవసరం లేకున్నా... లబ్ధిదారుల ఎంపిక, సిలిండర్ల సరఫరాకు..

Gas Cylinder Scheme: తెలంగాణలో రూ.500లకే గ్యాస్‌ సిలిండర్.. మరో నెల రోజుల్లో అమలు
Gas Cylinder Scheme
Rakesh Reddy Ch
| Edited By: Srilakshmi C|

Updated on: Dec 11, 2023 | 8:35 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 11: అధికారం చేపట్టిన వెనువెంటనే రెండు గ్యారెంటీ స్కీములను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.500 సిలిండర్ పై దృష్టి పెట్టింది. ఆరు గ్యారంటీ స్కీముల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అమలు చేయబోతున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ మాత్రం ఆ రెండు పథకాలు అమలు చేసినంత ఈజీ కాదు. భారీ ఎత్తున నిధులు అవసరం లేకున్నా… లబ్ధిదారుల ఎంపిక, సిలిండర్ల సరఫరాకు మాత్రం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500కు సిలిండర్లు అందిస్తారా?? లేక తెల్ల రేషన్ కార్డులు మాత్రమే ఉన్న బీపీఎల్ వర్గాలకు మాత్రమే సిలిండర్ అందిస్తారా? అనే విషయంలో లబ్ధిదారుల ఎంపిక మొదట పూర్తి చేయాలి.

అసలు ఈ సబ్సిడీని ఎలా అందిస్తారనేది మరో చిక్కుముడి. ఈ పథకం కింద ఏడాదికి మూడు లేదా నాలుగు సిలిండర్లు అందించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు భారత్ గ్యాస్, ఇండెన్, HP ఇలా రకరకాల గ్యాస్ కంపెనీ నుంచి సిలిండర్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.960 రూపాయలు ఉంది. ఇది తరచుగా మారుతూ ఉంటుంది. అయితే నేరుగా గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు చెల్లించి, మిగతా డబ్బులు కస్టమర్లు చెల్లించేలా పథకం అమల్లోకి తీసుకొస్తుందా? ఇలా తీసుకురావాలనుకుంటే గ్యాస్ కంపెనీలు ఇందుకు సహకరిస్తాయా? ఇప్పటివరకు ప్రభుత్వం గ్యాస్ కంపెనీ సంప్రదించిందా? అనే విషయాలపై స్పష్టత రాలేదు. ఒకవేళ గ్యాస్ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకొని మిగతా డబ్బులు వినియోగదారుల వద్ద తీసుకునేలా అయితే… ప్రభుత్వం ముందుగానే కంపెనీలకు డబ్బులు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వం కేటాయించిన సిలిండర్లు వాడలేకపోతే అప్పుడు.. ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంది.

ఇక కేంద్ర ప్రభుత్వం మాదిరిగా నేరుగా అకౌంట్లోకి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పంపించడం సులభమైన పద్ధతి. కానీ వినియోగదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, వినియోగదారుల గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ మొత్తం ప్రభుత్వానికి అందించాలి. ఇది కూడా గ్యాస్ కంపెనీలతో లింక్ అయి ఉన్న అంశం. ఇక ఇవేవీ కాకుండా ప్రభుత్వమే నేరుగా అన్ని గ్యాస్ కంపెనీ నుంచి సరిపడా సిలిండర్లను తీసుకొని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా పంపిణీ చేయడం మరో విధానం. దీని ద్వారా ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం వస్తువులు సరఫరా చేస్తున్నట్లుగానే సిలిండర్లు కూడా సరఫరా చేయొచ్చు. ఇది అన్నిటికంటే ఈజీ మెథడ్. ఈ రెండింటిలో ఏ పద్ధతిలో గ్యాస్ సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది అనేది ఆసక్తిగా మారింది. దీంతోపాటు లబ్ధిదారుల ఎంపిక కూడా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే గ్యారెంటీ స్కీములు ప్రకటించినప్పుడు ఎలాంటి కండిషన్స్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.