AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు – వాటి లోపల ఏముందా అని చూడగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గంజాయి ప్యాకెట్ల రహస్య నిల్వ బయటపడింది. దమ్మపేట–అశ్వారావుపేట సరిహద్దులో తోటలో మట్టిలో దాచిన 100 కిలోల గంజాయి వరదలో బయటపడింది. 44 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.50 లక్షలపైగా ఉండొచ్చని అంచనా. గంజాయి ఎక్కడి నుంచి? ఎవరు దాచారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు - వాటి లోపల ఏముందా అని చూడగా
Flood Water (A representative image )
Ram Naramaneni
|

Updated on: Jul 07, 2025 | 12:35 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు సంభవించిన నేపథ్యంలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. దమ్మపేట–అశ్వారావుపేట మండలాల సరిహద్దులోని ఆయిల్ ఫామ్ తోటలో దాచి ఉంచిన 100 కిలోల గంజాయి ప్యాకెట్లు వరదనీటిలో బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలో భూమిలో దాచిన గంజాయి ప్యాకెట్లపై వేసిన చెత్త, మట్టి వర్షపు ప్రవాహంతో కొట్టుకుపోయాయి. దీంతో ప్యాకెట్లు పూర్తిగా బయటపడిపోయి వరద నీటిలో కొట్టుకొచ్చాయి. వాటిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం 44 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్ దాదాపు 2.25 కిలోల చొప్పున ఉండగా, మొత్తం దాదాపు 100 కిలోల గంజాయిగా అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో రూ. 50 లక్షల పైమాటే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తరలించారు? ఎవరు దాచారు? ఎక్కడికి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేశారు? ఆయిల్ ఫామ్‌కు గంజాయి ఎలా వచ్చింది? వంటి అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు.

Ganja

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..