Telangana: పందేం రాయుళ్లకు అడ్డాగా మారిన అడవి.. గాల్లో దాన్ని చూసి.. పరుగే పరుగు..
పోలీసులను కూడా బురిడీ కొట్టించేలా తమ జూద క్రీడల కోసం కొత్త ప్రదేశాలను వెతుక్కుంటున్నారు పందేం రాయుళ్లు. గతంలో పండుగల సమయంలో లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రామాల్లో జూద క్రీడలు ఆడినా పోలీసులు చూసీ చూడనట్లు..
గ్రామలు, పట్టణాలు లేదా నగరాల్లోని ఖాళీ ప్రదేశాలు జూద క్రీడలకు అడ్డాగా మారిన విషయం తెలిసిందే. ఊర్లో జూద క్రీడలు ఆడితే పోలీసులు వస్తారనే భయంతో పందేం రాయుళ్లు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. పోలీసుల నిఘా ఉండని ప్రాంతాలను పందేల కోసం ఎంచుకుంటున్నారు. పోలీసులను కూడా బురిడీ కొట్టించేలా తమ జూద క్రీడల కోసం కొత్త ప్రదేశాలను వెతుక్కుంటున్నారు పందేం రాయుళ్లు. గతంలో పండుగల సమయంలో లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రామాల్లో జూద క్రీడలు ఆడినా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. ఇటీవల కాలంలో యువత జూద క్రీడలకు అలవాటుపడి.. ఆర్థికంగా నష్టపోయి, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జరుగుతుండటంతో జూద క్రీడలపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా ఈ నిషేధాలు, హెచ్చరికలు పందేం రాయుళ్లకు వంటపట్టడం లేదు. చివరికి అడవులను కూడా వదలడం లేదు పందేం రాయుళ్లు. ఎవరికంట పడకుండా కోడి పందేలు నిర్వహిస్తున్న పందేం రాయుళ్లు చివరికి డ్రోన్ కెమెరా కంట పడ్డారు. దీంతో డ్రోన్ కెమెరా చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు అక్కడున్నవారంతా. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా రీడ్ దిస్ స్టోరీ.
దట్టమైన అడవికి నిదర్శనం శ్రీశైలం నల్లమల్ల అడివి అని అందరూ టక్కున అంటారు . అదే హైదరాబాద్ కి సమీపంలోని అడవి అంటే మాత్రం అందరూ టక్కున మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి అని చెబుతారు ఎటువంటి సందేహం లేకుండా. హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో నర్సాపూర్ అడవి గురించి చాలా మందికి తెలుసు. హైదరాబాదు పరిసరాల నుండి చాలామంది అడవి అందాలను తిలకిస్తూ సేద తీరడానికి తరచుగా నర్సాపూర్ వస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం జూద క్రీడలు ఆడడానికి నర్సాపూర్ వస్తున్నారు.
సాధారణంగా అడవి అందాలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరాకు అలాంటి దృశ్యం తారసపడడంతో పందెం రాయుళ్లు పందెం తిలకించడానికి వచ్చిన ప్రజలు ఆ డ్రోన్ కెమెరాకు చిక్కారు ఇంకేముంది డ్రోన్ కెమెరాను చూసిన పందెం రాయుళ్లు పరుగులు తీశారు. ఎంతో ఆహ్లాదకరమైన నర్సాపూర్ అడవి.. జూద క్రీడలకు స్థావరంగా మారిందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి జూదక్రీడలు, పందేలు వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..