Hyderabad: 13 నుంచి 18 లక్షలకే ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మరో ఛాన్స్‌..

హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల విక్రయాలను అధికారులు మూడు నెలల క్రితమే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం, బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తులు..

Hyderabad: 13 నుంచి 18 లక్షలకే ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మరో ఛాన్స్‌..
Rajiv Swagruha Lottery
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 11, 2022 | 11:18 AM

హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల విక్రయాలను అధికారులు మూడు నెలల క్రితమే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం, బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ మొత్తం ఫ్లాట్లలో కేవలం 40 శాతం మాత్రమే లాటరీ ద్వారా విక్రయించారు. అలాగే లాటరీలో ఫ్లాట్‌ దక్కించుకున్న వారు కూడా పూర్తి డబ్బులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఫ్లాట్లు మిగిలిపోయాయి. దీంతో మిగిలిన ఈ ఫ్లాట్లకు మరోసారి లాటరీ వేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని హెచ్‌ఎండీఏ అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు, మిగిలిన వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆహ్వానం పలికారు. టొకెన్ అడ్వాన్స్ సొమ్మను చెల్లించేందుకు అక్టోబర్ 26వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించి వేలం బిడ్డింగ్‌లో పాల్గొన్న వారికి లాటరీ విధానంలో ఫ్లాట్లను అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫ్లాట్లలో సింగిల్, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అధికారులు చెబుతోన్న వివరాల మేరకు పోచారం, బండ్లగూడల్లో సింగిల్‌ బెడ్‌ రూం ఫ్లాటు రూ. 13 నుంచి 18 లక్షల వరకు, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌లు ఫ్లాట్ ధర రూ. 50 నుంచి 60 లక్షలకు పొందొచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం రాజీవ్‌ స్వగృహ అధికారిక వెబ్‌సైట్ లేదా, 79934 55776, 79934 55791 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు.