AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంక్షన్‌‌లో సరదాగా గడిపారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం.. కళ్లముందే భార్య, ఇద్దరు పిల్లలు సహా..

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ వీవీ ప్రసాద్ భార్య, ఇద్దరు పిల్లలు, స్నేహితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పంక్షన్‌‌లో సరదాగా గడిపారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం.. కళ్లముందే భార్య, ఇద్దరు పిల్లలు సహా..
Nalgonda Road Accident
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 12:11 PM

Share

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. తెల్లవారు జామున విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన వీవీ ప్రసాద్ హైదరాబాద్‌లోనీ SBI బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు. చెన్నైలో ఓ ఫంక్షన్ కు భార్య ఇద్దరు పిల్లలతోపాటు తన స్నేహితుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మధురానగర్ కు చెందిన శ్రీకర ప్రసాద్ (62) తో కలిసి హాజరయ్యాడు. తిరిగి చెన్నై నుంచి ఐదుగురు కలిసి కారులో హైదరాబాద్ కు బయలు దేరారు.

ఈ క్రమంలోనే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒడిశాకి చెందిన అర్షియా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో అందులో ప్రయాణిస్తున్న ఈ ప్రమాదంలో ఎస్‌బీఐ ఉద్యోగి ప్రసాద్‌ భార్య, కుమార్తె(15), కుమారుడు(10), ప్రసాద్‌ స్నేహితుడు శ్రీకర ప్రసాద్‌.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో ధ్వంసమైన కారును తొలగించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టంమీద బయటకు తీశారు.

కారు డ్రైవింగ్ చేస్తున్న వీవీ ప్రసాద్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో వీవీ ప్రసాద్ భార్య, 15 ఏళ్ళ కూతురు, 10 ఏళ్ల కొడుకు, 62 ఏళ్ల స్నేహితుడు శ్రీకర ప్రసాద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ