AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొలిటికల్ సీన్‌లో కనిపించని మల్లారెడ్డి.. ఇంతకీ ఏమయ్యింది?

మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే, చామకూర మల్లారెడ్డి ఏం చేసినా ట్రెండింగ్‌గానే ఉంటుంది. డైలాగ్‌ చెప్పినా.. పొలిటికల్ పంచ్‌లు వేయాలన్న, ఓ దరువు వేసినా.. లేక ఆ దరువుకు స్టెప్పులు వేసినా.. వైరల్‌గా మారిపోతుంది. ఏడుపదుల వయసులోనూ ఆయన ఎంతో ఎనర్జీగా కనిపిస్తారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అయిన మల్లారెడ్డి, గత కొన్నిరోజులుగా మీడియాకే దూరంగా ఉంటున్నారు.

Telangana: పొలిటికల్ సీన్‌లో కనిపించని మల్లారెడ్డి.. ఇంతకీ ఏమయ్యింది?
Ch Malla Reddy
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Jan 28, 2025 | 3:18 PM

Share

మాస్ మల్లన్న.. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక సోషల్ మీడియా స్టార్. పబ్లిక్లో భలే క్రేజ్..! ఎక్కడికి వెళ్లినా ఆయనతో సెల్ఫీ దిగడానికి పోటీలు పడే జనం. కొన్ని సందర్భాల్లో మాజీ మంత్రి కేటీ రామారావు సైతం నాకంటే మల్లన్నకే ఎక్కువగా క్రేజ్ ఉందని చెప్పిన సందర్భం. ఆయనే మన మాజీ మంత్రి మల్లారెడ్డి. యూత్‌ను అట్రాక్ట్ చేసే డైలాగ్స్‌తో, ప్లీజ్ వాయిస్ తో ఆయనే చెప్పే పంచ్ డైలాగులు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో తిరుగుతూ ఉంటాయి.

ఆయనే రాజకీయాల్లో అంతే చురుగ్గా కనిపిస్తూ ఉంటారు. అసెంబ్లీలో మాట్లాడిన నవ్వులే నవ్వులు. ఆయననే చామకూర మల్లారెడ్డి. మొదటిసారిగా 2014లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులుగా తెలుగు దేశం పార్టీ తరుఫున గెలుపొంది, కొద్ది రోజులకే గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వెంటనే కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మేడ్చల్ నుంచి మళ్లీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు మల్లారెడ్డి.

మంత్రిగా ఉన్నప్పుడు హల్చల్ చేసిన మాస్ మల్లన్న గత కొద్ది నెలలుగా మాత్రం చాలా సైలెంట్‌గా కనిపిస్తున్నారు. రాజకీయ ప్రసంగాలు లేవు, పవర్ ఫుల్ డైలాగులు లేవు, అసలు మీడియాలోనే కనిపించకుండాపోయారు. అంత యాక్టివ్‌గా ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి ఎందుకు ఇంత తెరవ వెనక్కి వెళ్లిపోయారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం ఆయన మనవరాలు పెళ్ళికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడమే అని కొంతమంది కార్యకర్తలు బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు.

మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలు ఇలా భారీ ఎత్తున విద్యాసంస్థలు ఉన్న మల్లారెడ్డి ప్రభుత్వంతో కొరివి పెట్టుకోవడం ఎందుకు అని సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఆయనే భారతీయ జనతా పార్టీలోకి వెళదామని ఆలోచన కూడా చేసినట్లు కార్యకర్తలు అంటున్నారు. అది కుదరక కాంగ్రెస్ కండువా కప్పుకోనైన వ్యాపారాలు కాపాడుకుందాం అనుకుంటే, అక్కడ అడ్డుపుల్ల పడిందంట..! మనవరాలు పెళ్ళికి ముఖ్యమంత్రి హాజరు కావడం, పెళ్లి కార్డు పేరుతో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవడం, మొత్తానికి మల్లన్న ఏదో సెట్టింగ్ చేసుకున్నారని పార్టీలో గుసగుస. అందుకోసమే గులాబీ పార్టీలోనే ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడకుండా ఉంటున్నారట. అసలు హడావుడి కనిపించడం లేదట.

ఇదిలావుంటే, బీఆర్ఎస పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మీడియాకు ఎప్పుడు అందుబాటులో ఉండి, సోషల్ మీడియాకు కావలసినంత మసాలా అందించే ఈ మాస్ మల్లన్న ఇప్పుడు మాత్రం కొద్ది రోజులు బ్రేక్ అంటున్నాడట.

మరిన్ని తెలంగాణా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..