తెరుచుకున్న పిల్లలమర్రి గేట్లు.. ఇక నుంచి దగ్గరి నుంచే వీక్షణ..

700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి ఇక నుంచి పర్యాటకులకు మరింత చేరువ కానుంది. ఇటీవలే అటవీశాఖ సంరక్షణలో పునరుజ్జీవనం పొందింది ఈ భారీ వృక్షం. శతాబ్ధాల తన మనుగడ పోరాటానికి నిలువుటద్దంలా నిలిచింది. పిల్లలమర్రి పునరుజ్జీవన ప్రాజెక్ట్ పూర్తికావడంతో ప్రభుత్వం పర్యాటకులకు శుభవార్త అందించింది.

తెరుచుకున్న పిల్లలమర్రి గేట్లు.. ఇక నుంచి దగ్గరి నుంచే వీక్షణ..
Mahaboobnagar
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 21, 2024 | 8:55 PM

700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి ఇక నుంచి పర్యాటకులకు మరింత చేరువ కానుంది. ఇటీవలే అటవీశాఖ సంరక్షణలో పునరుజ్జీవనం పొందింది ఈ భారీ వృక్షం. శతాబ్ధాల తన మనుగడ పోరాటానికి నిలువుటద్దంలా నిలిచింది. పిల్లలమర్రి పునరుజ్జీవన ప్రాజెక్ట్ పూర్తికావడంతో ప్రభుత్వం పర్యాటకులకు శుభవార్త అందించింది. ఇక నుంచి శతాబ్ధాల మహా వృక్షం నీడన నడవడానికి, దగ్గరి నుంచి చూసేందుకు అనుమతించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని లాంఛంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా పర్యాటకులకు దూరంగా ఉంటోంది. కొన్నాళ్ళ క్రితం తెగులు, చెదలతో పిల్లలమర్రికి జీవం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒకానోక సందర్భంలో ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని ఆందోళన ఏర్పడింది. మహావృక్షం వద్ద సరైన నిర్వాహణ లేదు. ఓ వైపు ఎండిపోవడం మరోవైపు చెదల పట్టడడం చెట్టును జీవం కోల్పోయేలా చేశాయి. ఇక చెదలు పట్టడంతో కొమ్మలకు తీవ్ర నష్టం జరిగింది. మహావృక్షం ఊడలు ఊడిపోవడం, ఆకులు ఎండిపోవడంతో పిల్లల మర్రి కళ తప్పింది. దీంతో పిల్లలమర్రి దీన పరిస్థితిని గమనించిన నాటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ మహావృక్షం సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

అటవీశాఖ పర్యవేక్షణలో అత్యాధునిక పద్ధతిలో చెట్టుకు జీవం పోసే ప్రయత్నం చేశారు. దెబ్బతిన్న చెట్టు కొమ్మలకు సెలైన్ బాటిళ్లలో క్లోరోపెరిపాస్ ద్రావణంతో చికిత్స అందించారు. ఊడల మొదళ్ల దగ్గర సేంద్రీయ ఎరువుల మట్టిని నింపారు. ఊడలు దెబ్బతినకుండా నేరుగా భూమిలోకి వెళ్ళేలా పివిసి పైపులను ఏర్పాటు చేశారు. ఈ పైపుల ద్వారా క్లోరోపైరిపాస్ లిక్విడ్‎ను ఊడలకు అందేలా చర్యలు తీసుకున్నారు. ఫారెస్ట్ అధికారుల ట్రీట్‎మెంట్‎తో పిల్లలమర్రి తిరిగి జీవం పోసుకుంది. చచ్చుబడిపోతున్న ఊడలు బాగా పెరిగి నేలలోకి చొచ్చుకెళ్లాయి. చెదలు పట్టిన కొమ్మలు మళ్లీ దృఢంగా తయారయ్యాయి. చెట్టు నిండా కొత్తగా కొమ్మలు, పచ్చని ఆకులుతో పచ్చని పందిరి వేసినట్లుగా సాక్షాత్కరిస్తోంది. వృక్షం సంరక్షణ చర్యలు చేపట్టినన్ని రోజులు ఆంక్షలు అమలు చేశారు. దూరం నుంచి మాత్రమే చెట్టును చూసి వెళ్లే ఏర్పాట్లు చేశారు. అందుకోసం ప్రత్యేకంగా వాచ్ స్టాండ్‎ను ఏర్పాటు చేశారు. వృక్షాన్ని తాకకుండా కేవలం సందర్శనకు మాత్రమే అవకాశం కల్పించారు.

మహావృక్షానికి జీవం పోయడమే కాకుండా పలు అభివృధి పనులు చేపట్టింది ప్రభుత్వం. చెట్టును, కొమ్మలు, ఊడలు తాకకుండా మహావృక్షం మర్రి నీడలో నడుస్తూ వెళ్లేలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం మౌలికవసతులను కల్పించారు. తాగునీటి ఏర్పాట్లు, సేదతీరేలా ఆకర్షణీయమైన బెంచీలు ఏర్పాటు చేశారు. ఇక పిల్లల కోసం సరికొత్తగా పార్కును, వాల్ పెయింటింగ్స్‎తో పిల్లలమర్రి పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెరుచుకున్న పిల్లలమర్రి గేట్లు.. ఇక నుంచి దగ్గరి నుంచే వీక్షణ..
తెరుచుకున్న పిల్లలమర్రి గేట్లు.. ఇక నుంచి దగ్గరి నుంచే వీక్షణ..
రియాక్టర్ పేలుడుతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
రియాక్టర్ పేలుడుతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
రికార్డ్ బ్రేక్ చేస్తానంటూ బరిలోకి.. కట్‌చేస్తే.. జీరోకే రిటన్
రికార్డ్ బ్రేక్ చేస్తానంటూ బరిలోకి.. కట్‌చేస్తే.. జీరోకే రిటన్
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని
మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
పంత్ కోసం బలిపశువు.. 3 మ్యాచ్‌ల్లో 190 పరుగులు చేసినా బెంచ్‌కే..
పంత్ కోసం బలిపశువు.. 3 మ్యాచ్‌ల్లో 190 పరుగులు చేసినా బెంచ్‌కే..
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
రోజూ పెరుగు తింటున్నారా..? శరీరానికి ఏమవుతుందో తెలిస్తే..
రోజూ పెరుగు తింటున్నారా..? శరీరానికి ఏమవుతుందో తెలిస్తే..
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!
కేరళలో పక్షి జెండా ఎగరేసిందా.? ఆ వీడియోలో నిజమెంత.?
కేరళలో పక్షి జెండా ఎగరేసిందా.? ఆ వీడియోలో నిజమెంత.?
ఇన్‌స్టా రీల్స్‌ నుంచి ప్రభాస్‌కు జోడీగా ఛాన్స్‌ కొట్టేసిన ఇమాన్.
ఇన్‌స్టా రీల్స్‌ నుంచి ప్రభాస్‌కు జోడీగా ఛాన్స్‌ కొట్టేసిన ఇమాన్.
వైరల్‌ కావాలనుకున్నాడు.. విగతజీవిగా మారాడు !!
వైరల్‌ కావాలనుకున్నాడు.. విగతజీవిగా మారాడు !!
ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు పెరిగిన ఏసీల వినియోగం
ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు పెరిగిన ఏసీల వినియోగం