హాట్సాఫ్..! కాకిని కాపాడడం కోసం తన ప్రాణాలను పణ్ణంగా పెట్టిన ఫైర్ మెన్..!
గాలిపటం వైర్లలో చిక్కుకొని సెల్ టవర్‌కు వేలాడుతున్న ఓ కాకి తల్లడిల్లిపోయింది. గాలిలో వేలాడుతూ కొట్టుమిట్టాడుతున్న కాకి ప్రాణాలు కాపాడడం కోసం ఫైర్ మెన్ తన ప్రాణాలను పణ్ణంగా పెట్టాడు. కాకి సురక్షితంగా బయటపడటంతో.. అక్కడి నుండి కాకుల గుంపు.. సంతోషంగా ఎగిరి పోయాయి. సెల్ టవర్ పైకి ఎక్కి.. ఆ కాకి ప్రాణాలు కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
Updated on: Sep 02, 2025 | 11:41 AM

గాలిపటం వైర్లలో చిక్కుకొని సెల్ టవర్‌కు వేలాడుతున్న ఓ కాకి తల్లడిల్లిపోయింది. గాలిలో వేలాడుతూ కొట్టుమిట్టాడుతున్న కాకి ప్రాణాలు కాపాడడం కోసం ఫైర్ మెన్ తన ప్రాణాలను పణ్ణంగా పెట్టాడు. సెల్ టవర్ పైకి ఎక్కి.. ఆ కాకి ప్రాణాలు కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

వరంగల్ మహానగరంలోని 39 వ డివిజన్ సాకరాశికుంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సెల్ టవర్‌కు వేలాడుతున్న గాలిపటం దారానికి ఓ కాకి చుట్టుకుంది. కాకి కాళ్ళకు దారాలు చుట్టుకోవడంతో తెల్లవారుజాము నుండి ఆ కాకి కావ్.. కావ్.. అని అరుస్తుంది.

ఆ కాకి కాలుకు దారాలు చుట్టుకుని తలకిందులుగా వేలాడుతుంటే ఆ ప్రాంతంలో కాకులంతా తిరుగుతుండడంతో స్థానికులు ఇండ్లలో నుంచి బయటికి వచ్చి చూశారు. సెల్ టవర్‌కి కాకి వేలాడుతుండటాన్ని గమనించారు. వెంటనే స్థానికులు ఫైర్ ఆఫీస్ కి ఫోన్ చేశారు.

ఫైర్ సిబ్బంది స్పందించి వెంటనే అక్కడికి చేరుకున్నారు.. సెల్ టవర్ కు వేలాడుతున్న కాకిని చూసి రిస్క్యూ చేశారు. తన ప్రాణాల సైతం లెక్కచేయకుండా ఫైర్ మెన్ ప్రసాద్ తన ఆఫీసర్ సూచనల మేరకు తోటి సిబ్బంది సహకారంతో సెల్ టవర్ ఎక్కి కాకిని రక్షించాడు.

కాకి సురక్షితంగా బయటపడటంతో.. అక్కడి నుండి కాకుల గుంపు.. సంతోషంగా ఎగిరి పోయాయి. దీంతో స్థానికులంతా ఫైర్ మెన్ ప్రసాద్‌ని, ఫైర్ సిబ్బందిని అభినందించారు..




