COVID-19 impact: మనుషులపైనే కాదు దేవుళ్లపైనా కరోనా ఎఫెక్ట్.. గణేష్ ఉత్సవాలు ఎవరింట్లో వాళ్లే జరుపుకోవాలేమో..
కరోనా విఘ్నాలైతే తొలగుతున్నాయి కానీ, సర్వ విఘ్నాలకు అధిపతియైన గణపతికి మాత్రం విఘ్నం తప్పడం లేదు. ఈ ఏడాది కూడా ఎవరింట్లో వాళ్లే వినాయక చవితిని జరుపుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.

థియేటర్లు తెరుచుకున్నాయ్. స్కూళ్లూ ఓపెన్ అవుతున్నాయ్. కరోనా విఘ్నాలన్నీ తొలగిపోతున్నాయ్. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారు. కరోనా విఘ్నాలైతే తొలగుతున్నాయి కానీ, సర్వ విఘ్నాలకు అధిపతియైన గణపతికి మాత్రం విఘ్నం తప్పడం లేదు. ఈ ఏడాది కూడా ఎవరింట్లో వాళ్లే వినాయక చవితిని జరుపుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. వినాయక చవితి అంటే ఆ జోషే వేరు. నాలుగైదు నెలల ముందు నుంచే విగ్రహాలు తయారైతే, నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. గణపతి బప్పా మోరియా… జైబోలో గణేష్ మహరాజ్ కీ జై… నినాదాలతో దేశమంతా మారుమోగిపోతుంది.
గణేష్ మండపాలు, భారీ సెట్టింగులు, వీధికో వినాయకుడు, పెద్దఎత్తున పూజలు… ఇలా ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక, నవరాత్రుల చివరి రోజున నిర్వహించే శోభాయాత్ర అయితే మామూలుగా ఉండదు. కిలోమీటర్ల మేర బారులు తీరిన గణనాథులను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. కానీ, ఇదంతా గతం. రెండేళ్ల నుంచి ఆ సందడే లేదు. కరోనా మహమ్మారి మనుషులపైనే కాదు, చివరికి దేవుళ్లపైనా ప్రభావం చూపించింది. దాంతో, ఈ ఏడాది కూడా వినాయక చవితి సందడి కనిపించే అవకాశం కనిపించడం లేదు.
గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు భాగ్యనగరం. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ లో సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. భాగ్యనగరంలో జరిగే గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ ది ప్రత్యేక స్థానం. ఖైరతాబాద్ గణేష్ ను చూడ్డానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అందుకే, ప్రతి ఏటా ఖైరతాబాద్ వినాయకుడిని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. కానీ, ఆ సందడి ఇప్పుడు కనిపించడం లేదు.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఎవరింట్లో వాళ్లే వినాయక చవితిని జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. అంతేకాదు, పండగి సామగ్రి కొనేటప్పుడు మార్కెట్లలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరాయి. దాంతో, ఈసారి కూడా ఉత్సవాలు కళ తప్పాయనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..
