Telangana: గుండెపోటుతో తండ్రి మృతి.. అంత్యక్రియల్లో ‘ఆ నలుగురు’గా మారిన కూతుళ్ళు!
అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. "ఆ నలుగురు" గా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వహించారు. మణుగూరు మండలం రాజుపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.'కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిగా పెంచాలిరా..' అనే పాటకు నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యాలు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఆకాల మరణం మనసును మెలిపెడుతున్న మొక్కవోని ధైర్యంతో..
మణుగూరు, డిసెంబర్ 19: అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. “ఆ నలుగురు” గా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వహించారు. మణుగూరు మండలం రాజుపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.’కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిగా పెంచాలిరా..’ అనే పాటకు నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యాలు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఆకాల మరణం మనసును మెలిపెడుతున్న మొక్కవోని ధైర్యంతో అంతిమ సంస్కారంలో అన్ని తామై ఆ నలుగురుగా మారారు ఈ కూతుళ్ళు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది..
మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ లో నరసింహారావు – గోపమ్మ దంపతులు నివాసముంటరు, నరసింహరావు సింగరేణి విశ్రాంత ఉద్యోగి, వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు, తనకు ఉన్నంతలో ఆరుగురు పిల్లలని ఉన్నత చదువులు చదివించాడు నరసింహరావు, రెండు సంవత్సరాల క్రితం ఈతకు వెళ్లి కుమారుడు గోదావరిలో పడి చనిపోయాడు. అప్పటి నుండి ఆ ఇంటికి అన్ని తామే అయి ఆ కుతుర్లే అమ్మానాన్నలను చూసుకుంటున్నారు. నరసింహారావు నిన్న తెలవారుజామున గుండె నొప్పితో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు హాస్పటల్‌కి తరలించారు.
చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే నరసింహ రావు మృతి చెందాడు. ఇంట్లో మగ వాళ్ళు ఎవరు లేకపోయే సరికి అన్ని తామై తమ తండ్రీ చివరి కార్యక్రమాలు నిర్వహించారు అయిదుగురు కూతుళ్లు. తండ్రి చివరి అంకంలో పెద్ద కూతురు తలకొరివి పెట్టగా మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.