Telangana: తనదైన మార్క్‌ చూపిస్తున్న తెలంగాణ కొత్త సీఎం.. 13 రోజుల్లో..

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 13 రోజులు పూర్తయ్యింది. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిప్యూటీ సీయంగా భట్టి విక్రమార్క తోపాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సీయంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే.. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచను తొలగించారు అధికారులు. ప్రగతి భవన్‌ను...

Telangana: తనదైన మార్క్‌ చూపిస్తున్న తెలంగాణ కొత్త సీఎం.. 13 రోజుల్లో..
Revanth Reddy
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Narender Vaitla

Updated on: Dec 19, 2023 | 10:25 AM

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి 13 రోజులు పూర్తయ్యింది. ఈ 13 రోజులుగా వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వర్తించారు. ఒకవైపు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూనే.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు వేశారు. మేం పాలకులం కాదు సేవకులం అని సీఎం రేవంత్ తనదైన మార్క్ వేసే పయత్నం చేస్తున్నారు.

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 13 రోజులు పూర్తయ్యింది. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిప్యూటీ సీయంగా భట్టి విక్రమార్క తోపాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సీయంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే.. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచను తొలగించారు అధికారులు. ప్రగతి భవన్‌ను జ్యోతిరావు పూలే అంబేద్కర్ భవన్‌గా పేరు మర్చారు రేవంత్. సచివాలయంలో చార్జ్ తీసుకున్నారు. మరుసటి రోజు నుంచి ప్రజాభవన్లో ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.

మరోవైపు సీఎం రేవంత్.. ప్రగతి భవన్‌లో ఉండనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే ప్రతి రోజు సచివాలయానికి వస్తున్నారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు పరిచారు రేవంత్. డిసెంబర్ 9న అసెంబ్లీ ఆవరణంలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సచివాలయంలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు.

సీఎం భవనం వినియోగించుకోక పోవడమే కాదు.. సీఎం కాన్వాయ్‌లో కూడా వాహానాల సంఖ్యను 15 నుంచి 9కి తగ్గించుకున్నారు. అంతేకాదు సొంత వాహానంలోనే తిరుగుతున్నారు సీఎం రేవంత్. ఇక కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను ఆపోద్దని ఆదేశాలు జారీ చేశారు. సాదారణ వాహానదారులతోనే తన కాన్వాయ్ వెళ్లేలా చూడాలని అధికారులను కోరారు.

ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు భరోసా కల్పించేలా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసేలా చర్యలు చేపట్టారు. మరో వైపు ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంటే తప్పేంటీ.. అవకాశం వుంటే ఉద్యోగంలోకి తీసుకోండి అని డీజీపీ, సీఎస్ లకు ఆదేశాలు జరీ చేశారు. వెంటనే పోలీస్ కానిస్టేబుల్, హోం గార్డు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో సైతం రేవంత్ తనదైన స్టయిల్ లో ప్రతిపక్ష పార్టీఐనా బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి సీయం రేవంత్ 13 రోజుల పాలనలో తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..