ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్‌లో మంటలు అంటుకుని ముగ్గురు సజీవదహనం
ఖమ్మం - వరంగల్ మధ్య జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్యాబిన్‌లో మంటలు చేలరేగి ఈ దారుణం చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొట్టాయి. ఒక లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు అందులోనే సజీవ దహనం అయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఒక లారీ విజయవాడ నుండి పౌల్ట్రీ మెటీరియల్ లోడ్ తో గుజరాత్‌కు వెళ్తోంది. గ్రానైట్ లోడ్ లారీ వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తోంది. శుక్రవారం(జూలై 04) తెల్లవారుజామున ఈ రెండు లారీలు వేగంగా డీ కొనడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్యాబిన్‌లో సజీవదహనం అయిన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో ఖమ్మం – వరంగల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..