Telangana: కామారెడ్డి జిల్లాలో విషాదం.. సెల్ టవర్‌పై రైతు ఆత్మహత్య..
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లింగంపేట్ మండలం మేగరంలో పుట్ట ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన రైతు..
Farmer Commits Suicide: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లింగంపేట్ మండలం మేగరంలో పుట్ట ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన రైతు.. అక్కడే ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అంతులేని విషాదం నింపింది. ఆంజనేయులు సెల్‌టవర్ ఎక్కాడన్న సమాచారం అందుకున్న భార్య పిల్లలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నాన్న కిందకు దిగి రావాలని పిల్లలు వేడుకున్నారు. గుక్కపట్టి ఏడ్చారు. కానీ అప్పటికే ఆంజనేయులు టవల్‌తో ఉరివేసుకున్నాడు. తండ్రి చనిపోయాడని తెలియక.. పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటన అందర్నీ కలచివేసింది.
మేగరం చెరువులో నీళ్లు లేక ఆంజనేయులు వేసిన పంట పూర్తిగా పాడయింది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంట నష్టపరిహారం ఇవ్వాలని వేడుకున్నారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సెల్ టవర్ ఎక్కి.. తన ఆవేదనను అందరికీ తెలిసేలా నినదించాడు.
సెల్ టవర్ ఎక్కాక ఆంజనేయులు ఏం ఆలోచించాడో తెలియదు.. అక్కడే టవల్‌తో ఉరివేసుకున్నాడు. ఆంజనేయులు టవరెక్కగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ రైతు బలవన్మరణాన్ని ఆపలేకపోయారు. ఖాకీల సాక్షిగా.. భార్య బిడ్డల ఆర్తనాదాల మధ్య రైతు ప్రాణం గాలిలో కలిసిపోయింది.
ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం