Telangana: తెలంగాణ నెక్స్ట్ డీజీపీ ఎవరు.. పోలీస్ వర్గాల్లో హాట్ టాపిగ్ గా మారిన ఇష్యూ..

తెలంగాణ డీజీపీ రేస్ కోసం ఐదుగురు ఐపీఎస్ అధికారులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెలలో పదవీ విరమణ చేస్తుండటంతో తదుపరి డీజీపీ పోస్ట్ ఎవరిని వరిస్తుందనే విషయంపై...

Telangana: తెలంగాణ నెక్స్ట్ డీజీపీ ఎవరు.. పోలీస్ వర్గాల్లో హాట్ టాపిగ్ గా మారిన ఇష్యూ..
Dgp Mahender Reddy
Follow us

|

Updated on: Dec 05, 2022 | 6:08 PM

తెలంగాణ డీజీపీ రేస్ కోసం ఐదుగురు ఐపీఎస్ అధికారులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెలలో పదవీ విరమణ చేస్తుండటంతో తదుపరి డీజీపీ పోస్ట్ ఎవరిని వరిస్తుందనే విషయంపై చర్చ సాగుతోంది. ఈ రేసులో ఐదుగురు ఐపీఎస్ లు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే వీరి పేర్లను యూపీపీఎస్సీ కి రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. త్వరలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అవుతున్నారు. తదుపరి డీజీపీ ఎవరనే చర్చ ఇప్పటికే పోలీస్ అధికారుల వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది . అటు రాజకీయ పరంగానూ ప్రభుత్వానికి వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఐదుగురు ఐపీఎస్ ల లిస్ట్ ను కమిషన్ కు పంపేందుకు సిద్ధం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ పదవి కోసం ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా కోనసాగుతోంది. హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా తో పాటు ఏసీబీ డీజీ అంజనీ కుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరితో పాటు 1989 బ్యాచ్ అధికారి ఉమేష్ షరీఫ్ సైతం రేసులో ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ లు కూడా క్యూ లో ఉన్నారు. ప్రస్తుత హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్ తో పాటు రాజీవ్ రతన్ లు కూడా డీజీపీ రేస్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ అడిషనల్ డీజీ క్యాడర్ కావడం తో డీజీ ప్రమోషన్ వచ్చే వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే డీజీ గా ఉన్న గోవింద్ సింగ్ పదవీ విరమణ చేయడంతో ఇద్దరికీ డిజీ లుగా ప్రమోషన్ లు రానున్నాయి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది చూడాల్సి ఉంది. ఎలక్షన్ ఇయర్ కావడం, రానున్నది ఎన్నికల సీజన్ కావటంతో డీజీపి పదవి ఎవరిని వరిస్తుందన్నది సర్వత్రా ఆసక్తి గా మారింది. త్వరలోనే ఈ ఐదుగురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వీరిలో ముగ్గురు పేర్లను సూచించగా అందులో నుంచి సీఎం కేసీఆర్ ఒకరిని ఎంపిక చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం