Telangana: చేతబడి కాదు.. వ్యాధి కాదు.. ఆ కుటుంబంలోని మరణాల వెనుకున్న మిస్టరీ ఇదే..

కరీంనగర్‌ జిల్లాలో ఒకే కుటుంబంలో వరుస మరణాల మిస్టరీలో కొత్త కోణం వెలుగుచూసింది. భార్యా బిడ్డల మృతికి భర్త శ్రీకాంతే కారణమన్న అనుమానం బలపడుతోంది.

Telangana: చేతబడి కాదు.. వ్యాధి కాదు.. ఆ కుటుంబంలోని మరణాల వెనుకున్న మిస్టరీ ఇదే..
Family Death Case

Updated on: Jan 04, 2023 | 9:14 AM

కరీంనగర్‌ జిల్లాలో ఒకే కుటుంబంలో వరుస మరణాల మిస్టరీలో కొత్త కోణం వెలుగుచూసింది. భార్యా బిడ్డల మృతికి భర్త శ్రీకాంతే కారణమన్న అనుమానం బలపడుతోంది. శ్రీకాంత్‌ మరణానికి కారణమైన సోడియం హైడ్రాక్సిడ్ ఆయన భార్యాబిడ్డల మరణాలకూ కారణమై ఉంటుందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. శ్రీకాంత్‌ సహా నలుగురి మృతిలోనూ రక్తపు వాంతులు కామన్‌గా ఉండడంతో శ్రీకాంతే తల్లీబిడ్డలకు సోడియం హైడ్రాక్సిడ్‌ ఇచ్చి చంపాడన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకే నెలలో కరీంనగర్‌ జిల్లా, గంగాధర మండలానికి చెందిన శ్రీకాంత్‌ భార్య మమత, పిల్లలు అమూల్య అద్వైత్‌లు అంతుచిక్కని విధంగా రక్తపు వాంతులు చేసుకొని, మృత్యువాత పడ్డారు. ఆ తరువాత మమతా భర్త శ్రీకాంత్‌ సైతం రక్తపు వాంతులతో మరణించాడు. అయితే మరణించడానికి ముందు సోడియం హైడ్రాక్సిడ్ ద్రావణం తాగినట్లు శ్రీకాంత్ పోలీసులకు వెల్లడించాడు.

దీంతో శ్రీకాంత్ భార్య ఇద్దరు పిల్లలకు సోడియం హైడ్రాక్సిడ్ ఇచ్చి ఉంటాడని, అందుకే వీరికి సైతం రక్తపు వాంతులయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే తప్ప ఏమీ చెప్పలేమని పోలీసులు చెప్తున్నారు. ల్యాబులో పనిచేసే శ్రీకాంత్‌ అక్కడ లభించే సోడియం హైడ్రాక్సిడ్ ని ఇంటికి ఎలా తీసుకెళ్లి ఉంటాడనే కోణం లోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నో పుకార్లు..

గంగాధర మండల కేంద్రంలో మమత ఆమె ఇద్దరు పిల్లలు అమూల్య, అద్వైత్ రక్తం వాంతులతో మరణించిన తర్వాత పలు పుకార్లు తెరపైకి వచ్చాయి. చేతబడి, అంతుచిక్కని వ్యాధి అని మృతుల కుటుంబ సభ్యులు భావించారు. అయితే.. మమత తల్లిదండ్రులకు మాత్రం ఆమె భర్త శ్రీకాంత్ పై అనుమానం తలెత్తింది. దీనిపై వారు పోలీసులకు సైతం చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే.. అంతు చిక్కని మరణాలపై విచారణ జరుగుతుండగానే డిసెంబర్ 30న శ్రీకాంత్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ సమయంలో సోడియం హైడ్రాక్సిడ్ (NAOH) ద్రావణం తాగినట్లు శ్రీకాంత్ పోలీసులకు వెల్లడించాడు. ద్రావణం తాగిన శ్రీకాంత్ రక్తం వాంతులు చేసికొని మరణించగా.. అతడి భార్య పిల్లలు అదే తరహాలో మృతి చెందారు. దీంతో శ్రీకాంత్ భార్య ఇద్దరు పిల్లలకు సోడియం హైడ్రాక్సిడ్ ఇచ్చి చంపాడని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..