Video: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపాలి: కేసీఆర్‌కు లేఖ రాసిన టీపీసీసీ చీఫ్‌

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై జరుగుతోన్న అసత్య ప్రచారాలను ఆపాలంటూ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కోరారు. ఈ మేరకు ఆక్ష్న బీఎర్‌ఎస్ ఛీప్ కేసీఆర్‌కు ఓ లేక రాశారు. బీఆర్‌ఎస్ హయంలోనే ప్రజలకు అన్యాయం జరిగిందని, తెలంగాణ 10 ఏళ్లు వెనకకు వెళ్లిందంటూ విమర్శించారు.

Video: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపాలి: కేసీఆర్‌కు లేఖ రాసిన టీపీసీసీ చీఫ్‌
Tpcc Chief Mahesh Kumar Gou
Follow us
Venkata Chari

|

Updated on: Dec 15, 2024 | 1:06 PM

Telangana: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపాలని డిమాండ్‌ చేస్తూ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ లేఖ రాశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వెనుకబడిందని విమర్శించారు. గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని, మాయమాటలతో పాలించారని తప్పుబట్టారు. ఈక్రమంలోనే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఈ లేఖలో చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేక, మీ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ఇప్పటికైనా దుష్ప్రచారాలు ఆపాలని మహేష్‌కుమార్ గౌడ్ డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..