ఇదేం కామెడి మావ.. రన్నింగ్లో బైక్ ఎక్కిన పాము
బైకులు, కార్లలోకి పాములు దూరడం వినే ఉంటాం. అయితే అది పార్క్ చేసిన వాహానాల్లో తిష్ట వేసి బుసలు కొడుతుంటాయి. ఇలాంటి వీడియోలు గతంలో అనేకసార్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ విచిత్రం జరిగింది. వాహనదారుడు రన్నింగ్లో ఉండగానే పాము బైకులోకి దూరిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పుట్టపర్తిలో ద్విచక్ర వాహనంలోకి ఓపాము దూరి హడలెత్తించింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి రవీంద్రశర్మ అనే వాహనదారుడు పుట్టపర్తికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సాయి టవర్ రెస్టారెంట్ వద్దకు రాగానే రన్నింగ్ లో బైకు లోకి పాము దూరింది. పామును చూసి వెంటనే బైక్ ను వదిలేసి ప్రక్కకు వెళ్ళిపోయాడు వాహనదారుడు. వాహనంలో దూరి తిష్ట వేసిన పాము ఎంతకూ బయటికి రాలేదు. దీంతో పాముతో పాటు బైక్ను మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. బైక్ డూమ్ లో తిష్ట వేసి పామును కట్టెతో పొడవగానే బయటికి వెళ్లిపోయింది. దీంతో వాహనదారుడు ఊపిరి పీల్చుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిలియన్ సం.రాలు పట్టే లెక్కను 5 నిమిషాల్లో చేసేస్తుంది.. అద్భుతం అన్న మస్క్
మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..
ట్రంప్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా ??
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

