అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్ !!
బిడ్డ పుట్టాక 21వ రోజున ఆ చిన్నారికి ఘనంగా ఉయ్యాల వేడుక చేయడం ఆనవాయితీగా వస్తుంది. అదే రోజున చాలామంది తమ బిడ్డలకు నామకరణం కూడా చేస్తుంటారు. అయితే ఇది మనుషులలో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. కానీ ఓ ఆవుదూడకు గ్రామస్తులంతా కలిసి వైభవంగా నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు.
మనుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాండ్ గా ఆవు దూడకు ఉయ్యాల ఫంక్షన్ ను నిర్వహించడం ఇప్పుడు ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో 21 రోజుల ఆవు దూడకు ఉయ్యాల ఫంక్షన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామస్తులు కన్నుల పండువగా నిర్వహించారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో వస్త్రంతో ఉయ్యాలను ఏర్పాటుచేశారు. అందులో అవు దూడను ఉంచి ఆ ఉయ్యాలను ఊపుతూ మహిళలు మంగళ హారతులు పాడారు. ఆవు దూడ నుదుటికి బొట్టు పెట్టి, అక్షింతలు వేస్తూ దానిని ఆశీర్వదించారు. అంతేకాకుండా ఉయ్యాలను రంగురంగుల బెలూన్లు, పూలతో డెకరేట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు
చేతబడులు.. భయంకర సంఘటనలు.. ఆహాలో హడలెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమా
430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !! అది డా… సూపర్ స్టార్ అంటే !!